newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

ఢిల్లీకి తెలంగాణ గవర్నర్.. ఆర్టీసీ సమ్మెపై నివేదిక?

15-10-201915-10-2019 12:33:24 IST
Updated On 15-10-2019 12:33:22 ISTUpdated On 15-10-20192019-10-15T07:03:24.564Z15-10-2019 2019-10-15T07:03:08.137Z - 2019-10-15T07:03:22.285Z - 15-10-2019

ఢిల్లీకి తెలంగాణ గవర్నర్.. ఆర్టీసీ సమ్మెపై నివేదిక?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. అందునా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుంటే రాజకీయం రంజుగా ఉంటుంది. తాజాగా తెలంగాణలో అదే జరుగుతోంది. తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకి మించిన హాట్ టాపిక్ లేదు.

గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారు. సమ్మె ఉధృ‌తంగా సాగుతోంది. తాజాగా ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా గవర్నర్ ని కలిసి సమ్మెలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో గవర్నర్‌కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీలో మధ్యాహ్నం ప్రధాని మోదీతో ఆమె సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ వరుస భేటీల అనంతరం ఏం జరగబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సమ్మెలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా? లేదా అనేది తేలాల్చి ఉంది. 

ఇప్పటికే ఆర్టీసీ జేఏసీతో పాటు బీజేపీ నేతలు కూడా గవర్నర్ ని కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో తెరాస తప్ప మిగిలిన అన్ని పక్షాలు కార్మికులకు బాసటగా నిలిచాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు వత్లిడికి గురవుతున్నారు. సమస్యను సాధ్యమయినంత త్వరగా ముగించేందుకు అధికార పార్టీ ఎంపీ కెకెను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం

   18 minutes ago


నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

   7 hours ago


 మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

   7 hours ago


ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

ఒక్క యాప్‌తో 87 రకాల పోలీస్ సేవలు.. ఏపీ కొత్త రికార్డు

   8 hours ago


బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   21 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   21 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   21 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   a day ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   21-09-2020


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   21-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle