డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!
24-05-202024-05-2020 09:21:56 IST
Updated On 24-05-2020 12:44:33 ISTUpdated On 24-05-20202020-05-24T03:51:56.721Z24-05-2020 2020-05-24T03:51:54.733Z - 2020-05-24T07:14:33.058Z - 24-05-2020

తెలంగాణలో కమలం పార్టీ డోసు పెంచుతుంది. కొత్త దళాధిపతి రావడంతోనే రాష్ట్ర బీజేపీలో సరికొత్త జోష్ ఉంటుందని అందరూ భావించినా కరోనా ప్రభావంతో ఆ వేడి అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతూ.. లాక్ డౌన్ సడలింపులు మొదలవడంతో బీజేపీ పార్టీ అదే మాదిరిగా మెల్లగా దూకుడు పెంచుకుంటూ పోతుంది. తాజాగా రాష్ట్రంలో సాగునీటి ప్రోజెక్టులలో అవినీతి అంటూ బీజేపీ దళం ఏకంగా గవర్నర్ తమిళిసైకి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు.. మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు.. వాటి వ్యయాలు.. పెరిగిన అంచనాలు.. పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలు, ఒప్పందాలు ఇలా అన్నీ అవినీతి మయమే అంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలోని బృందం గవర్నరును కలిసి ఫిర్యాదు చేశారు. చివరికి లాక్ డౌన్ సమయంలో కూడా కాంట్రాక్టులు అప్పగించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రోజెక్టుల కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని.. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో కేసీఆర్ రూ 24,096 కోట్ల విలువగల టెండర్లు పిలిచి, తమకు ఇష్టం వచ్చినవారికి కేటాయించారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పాత ప్రోజెక్టులతో తమకు ముడుపులు ముట్టవని తెలుసుకున్న కేసీఆర్ రీ డిజైన్ పేరుతో వ్యయాలు పెంచి.. తమ వారికే కాంట్రాక్టులు ఇచ్చి.. వాటాల వారీగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాడీ వేడి వ్యాఖ్యలతో రెచ్చిపోయే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన ఆరోపణలతో రెచ్చిపోయారు. జాతీయ సంపదైన ఖనిజ వనరులను అతిపెద్ద బడా సంస్థగా పేరున్న మైహోమ్ సంస్థ దోచుకుందని అరవింద్ ఆరోపించారు. తెలంగాణతో పాటు.. ఆంధ్రలోని కొన్ని గనుల గురించిన వివరాలు బయటపెట్టారు. అందులో సీఆర్హెచ్, జయజ్యోతి సిమెంట్స్ అనే సంస్థలకు.. ఏపీ, తెలంగాణలో ఉన్న లీజులు మైహోమ్ సంస్థ అక్రమంగా చేజిక్కించుకుందని అరవింద్ ఆరోపించారు. మైనింగ్ చట్టం ప్రకారం అన్ని రకాల బదిలీలు వేలం ద్వారా జరగాలని, కానీ అలా జరగలేదన్నారు. మైహోమ్ సంస్థ వేల కోట్ల జాతీయ సంపదను అడ్డంగా దోచుకుందని, అక్రమాల మీద సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర బీజేపీ నేతలు నిన్న నుండి అధికార పార్టీపై ఒక్కసారిగా దూకుడు పెంచి మాటలతోనే కాకమొదలుపెట్టారు. అయితే ఈ దూకుడు వెనుక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల అభిప్రాయం. బీజేపీ ఇప్పుడు దూకుడు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నా అధికార టీఆర్ఎస్ పార్టీ లాక్ డౌన్ లో కూడా సైలెంట్ గా తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టినట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కేసీఆర్ కుమార్తె కవిత ఉన్న సంగతి తెలిసిందే. కవిత బరిలోఉన్న ఆ స్థానంలో మెజార్టీ కోసం అధికార పార్టీ ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షించినట్లుగా వినిపిస్తుంది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లకు కూడా అధికార పార్టీ గాలమేసినట్లు తెలుస్తుంది. దీనంతటికి మైహోం సంస్థ ఆర్ధికంగా అండదండలు అందిస్తుందని బీజేపీ నేతల మాట. అందుకే ఆలస్యంగానైనా కాస్త దూకుడు పెంచడంతో పాటు ఆర్ధిక అండగా నిలిచిన సంస్థ.. ఆ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు.. వాటి లావాదేవీలు, టెండర్లు ఇలా అన్నిటిని కూపీలు లాగే పనిలో పడ్డట్లుగా కనిపిస్తుంది. అయితే, ఈ దూకుడు రాష్ట్ర బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది. పార్టీ అధిష్టానం అండదండలు రాష్ట్ర శాఖకు ఉంటాయా? అన్నది వేచిచూడాల్సి ఉంది.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా