newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

డెడ్‌లైన్‌లపై డోంట్ కేర్‌..!

05-11-201905-11-2019 08:31:44 IST
2019-11-05T03:01:44.863Z05-11-2019 2019-11-05T03:01:02.292Z - - 21-02-2020

డెడ్‌లైన్‌లపై డోంట్ కేర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ ఉద్యోగులు త‌మ‌కు పిల్ల‌ల‌తో స‌మాన‌మ‌ని, వారిపై త‌మ‌కు కోపం లేద‌ని చెబుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వారికి పెట్టిన డెడ్‌లైన్  ఇవాళ్టితో ముగుస్తుంది. గ‌త నెల 6వ తేదీగా పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్టీసీ కార్మికులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో 48 వేల కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయిన‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ, ఆయ‌నే మ‌న‌స్సు మార్చుకొని మ‌రోసారి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు అవ‌కాశం ఇచ్చారు.

ఇవాళ అర్థ‌రాత్రిలోగా విధుల్లో చేరాల‌ని చెప్పారు. కానీ, ఆర్టీసీ కార్మికులు మాత్రం ఈ డెడ్‌లైన్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఆర్టీసీ కార్మికులు మాత్రం యూనియ‌న్ల మాట జ‌వ‌దాట‌డం లేదు.

మూడు రోజుల్లో కేవ‌లం 26 మంది మాత్ర‌మే విధుల్లో చేరుతున్న‌ట్లు డిపోల్లో రిపోర్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ప‌రిస్థితులు, ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఆందోళ‌న‌తో వీరు ఉద్యోగాల్లో చేరారు.

ఉద్యోగాల్లో చేరే వారికి ర‌క్ష‌ణ కూడా క‌ల్పిస్తామ‌ని పోలీసులు హామీ ఇస్తున్నారు. అయినా ఆర్టీసీ కార్మికులు అంత‌గా స్పందించ‌డం లేదు. నిన్న‌, మొన్న విధుల్లో చేరిన కొంద‌రు ఉద్యోగులు సైతం మ‌ళ్లీ స‌మ్మెలోకి వ‌చ్చారు. కార్మికుల‌ను ఏక‌తాటిపై ఉంచ‌డ‌టంతో ఆర్టీసీ యూనియ‌న్ల నాయకులు విజ‌య‌వంత‌మ‌య్యారు.

అయితే, ఇప్ప‌టికే స‌గం రూట్ల‌ను ప్రైవేటుప‌రం చేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇదే జ‌రిగితే, స‌గం మంది ఉద్యోగాలు పోతాయ‌ని, మ‌రి అంద‌రూ చేరితే ఉద్యోగాలు ఎలా ఇస్తార‌ని ఆర్టీసీ జేఏసీ ప్ర‌శ్నిస్తోంది.

ఇవాళ ఆర్థ‌రాత్రిలోగానే విధుల్లో చేర‌క‌పోతే మొత్తం రూట్ల‌ను ప్రైవేటుప‌రం చేస్తామ‌ని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్‌ను కూడా ఉద్యోగులు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఆర్టీసీ ఉద్యోగులు బ‌లిదానాలు చేసుకోవ‌డం, బేష‌ర‌తుగా చేరాల‌ని ప్ర‌భుత్వం ష‌ర‌తు పెట్ట‌డంతో ఆర్టీసీ కార్మికులు ఈ స‌మ‌స్య‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విధుల్లో చేరేందుకు కార్మికులు మొగ్గు చూప‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ ఉద్యోగం పోద‌నే ఒక న‌మ్మ‌కం మాత్రం ఇంకా కార్మికుల్లో ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

మ‌రోవైపు ప్ర‌భుత్వం ఆర్టీసీని ప్రైవేటుప‌రం చేసే దిశ‌గా వేగంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇవాళ్టి డెడ్‌లైన్ పూర్త‌య్యాక కార్మికుల‌కు ప్ర‌భుత్వం మ‌రో ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం క‌నిపించ లేదు. ఇప్ప‌టికే ప్రైవేటు బ‌స్సులు న‌డిపించ‌డ‌మే మంచిద‌నే విధంగా ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఇవాళ చాలా మంది కార్మికులు విధుల్లో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   5 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   12 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle