newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

‘డెంగీ’పై కోర్టు అక్షింతలు.. చర్యలు తీసుకుంటారా?

25-10-201925-10-2019 09:25:56 IST
Updated On 25-10-2019 09:26:09 ISTUpdated On 25-10-20192019-10-25T03:55:56.683Z25-10-2019 2019-10-25T03:55:25.160Z - 2019-10-25T03:56:09.543Z - 25-10-2019

‘డెంగీ’పై కోర్టు అక్షింతలు.. చర్యలు తీసుకుంటారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా డెంగీ మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తోంది. డెంగీతో పాటు టైఫాయిడ్, వైరల్ జ్వరాలు జనాన్ని మంచాన పడేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కార్పోరేట్ ఆస్పత్రుల వరకూ బెడ్ లు ఖాళీలేక బల్లలపై జనం సెలైన్ బాటిళ్ళు ఎక్కించుకుంటూ చికిత్స తీసుకుంటున్నారు. డెంగీ బారిన పడి ఓ మహిళా న్యాయమూర్తి మృత్యువాత పడడం కలచి వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు, వైద్య సిబ్బంది పట్టించుకుంటారా? అనేది సందేహంగా ఉంది.

రాష్ట్రంలో డెంగీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డెంగీ గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి సహా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ  ఇవ్వాల్సి వచ్చింది. ఈ  క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి చెందింది.

డెంగీ జ్వరాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కోర్టుకి తెలిపారు. అవి సక్రమంగా ఉంటే.. జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరుగుతాయని కోర్టు ప్రశ్నలు కురిపించింది.

అంతేకాదు హైకోర్టులోనే దోమలున్నాయని కోర్టు తెలపడం గమనార్హం. డెంగీ నివారణ చర్యల కోసం సీఎస్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన నివేదిక అందించాలని కోర్టు పేర్కొంది.

వైద్య చికిత్స, వివిధ వ్యాధి నివారణ చర్యల గురించి  ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ కేసు విచారణను నవంబర్  మొదటి వారానికి వాయిదా వేసింది. అంతేకాదు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ ఖాతాల నుంచి  రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ఆగ్రహం వల్లనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle