డీజీపీ హెచ్చరించినా వినలేదు.. కర్ప్యూ సమయం పొడిగింపు బాటలో తెలంగాణ
22-04-202022-04-2020 16:17:23 IST
Updated On 22-04-2020 16:22:56 ISTUpdated On 22-04-20202020-04-22T10:47:23.178Z22-04-2020 2020-04-22T10:47:21.096Z - 2020-04-22T10:52:56.371Z - 22-04-2020

కరోనా వైరస్ ప్రభుత్వానికే వణుకు తెప్పిస్తున్నట్లుంది కానీ సామాన్యులు దాన్ని ఏమాత్రం లెక్కపెట్టకపోవడంతో పోలీసు ఆంక్షలు ధిక్కరించి మరీ రోడ్లమీదికి వచ్చేస్తున్నారు. లౌక్‌డౌన్ నిబంధనలను కఠినం తరం చేస్తామని తెలంగాణ డీజీపీ హెచ్చరించినప్పటికీ జనం వినడం లేదు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా వాహనాలను పోలీసులు స్వాధీన పర్చుకున్నారంటేనే లాక్ డౌన్‌కు ప్రజలు ఏమేరకు గౌరవం ఇస్తున్నారో అర్థమవుతుంది. ఇలా పని కాదని భావించిన ప్రభుత్వం, పోలీసుల శాఖ తెలంగాణలో కర్ఫ్యూవేళలనే మరింతగా పొడిగిద్దామన్న యోచనకు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా కల్లోలం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ కట్టడికి గానూ లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కేసీఆర్ నుంచి పోలీసుల వరకు పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా, కొంతమందికి ఇదేమీ పట్టడంలేదు. లాక్డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి రోడ్లెక్కుతున్నారు. సోమవారం పలుచోట్ల పెద్దసంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన జనం.. మంగళవారం కూడా కార్లు, ద్విచక్రవాహనాలతో రోడ్డుపైకి వచ్చారు. లాక్డౌన్ ఉల్లంఘనలను ఎట్టిపరిస్థితిల్లో సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్వయంగా డీజీపీ వెల్లడించిన మరుసటి రోజే జనం ఆ మాటలు పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఉల్లంఘనలను సర్కారు సీరియస్‌గా పరిగణిస్తోంది. ఓవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం.. మరోవైపు మాస్క్ వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా చాలామంది రోడ్లపైకి వస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మే 7వ తేదీకి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి కొత్త పాజిటివ్ కేసులను నియంత్రించాలన్న సర్కారు ఆలోచనకు విఘాతం కలిగించేలా మారిన ఈ వ్యవహారాన్ని వెంటనే నియంత్రించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాత్రివేళ అమల్లో ఉన్న కర్ఫ్యూ వేళలను పొడిగించే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దుకాణాలు తెరిచి ఉన్నంతసేపు నిత్యావసరాల సాకుతో జనం రోడ్లపైకి వస్తున్నందున అవి తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వెసులుబాటు ఉంది. ఆయా దుకాణాలను ఆ సమయంలో తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. సాయంత్రం ఆరు తర్వాత కర్ఫ్యూ మొదలవుతుంది. హైదరాబాద్‌లో ఈ వేళలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ మొదలు కాగానే రోడ్లపై జన సంచారం ఒక్కసారిగా తగ్గిపోతోంది. అడపాదడపా కొన్ని వాహనాలు తప్ప ఎవరూ బయటకు రావడంలేదు. ఎవరైనా బయటకు వచ్చినా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం లాక్డౌన్ పూర్తిగా అపహాస్యమవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన దుకాణాలు తప్ప మిగతావి మూతపడే ఉంటున్నాయి. కానీ ప్రజలు నిత్యావసరాల వస్తువుల కొనుగోలు కోసం అని, ఇతరత్రా అత్యవసర పనులని చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఎవరిని అడ్డుకోవాలో, ఎవరిని అనుమతించాలో తెలియక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఇది జనం ఎక్కువగా తిరగడానికి కారణమవుతోంది. ఇక కొనుగోలు ప్రాంతాల్లో భౌతిక దూరం అసలే అమలు కావటం లేదు. ఇది కరోనా కేసుల విస్తృతికి కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మరోసారి కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఉల్లంఘనల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. పరిస్థితిని సరిదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలోనే పోలీసులు లాక్డౌన్ వేళలను సవరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలుకు ఉన్న సమయాన్ని కుదించాలని పేర్కొన్నారు. కానీ ఈ వేళలు తగ్గిస్తే.. ఉన్న తక్కువ సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తారని, అప్పుడు రద్దీ పెరిగి భౌతిక దూరం విధానం అమలు కాదని సీఎం భావించారు. అయితే, ఆయన సదుద్దేశంతో ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ వెసులుబాటును తగ్గించే విషయాన్ని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. కర్ఫ్యూ సమయంలో జనాన్ని నియంత్రించేందుకు పోలీసులకు వీలు చిక్కుతుంది. ఆ సమయంలో రోడ్లపైకి రావటానికి ఎవరికీ అనుమతి ఉండదు కాబట్టి, రోడ్లపైకి రావాలనుకునేవారు కూడా కాస్త ఆలోచిస్తారు. ఒకవేళ ఎవరైనా అలా వచ్చినా పోలీసులు నియంత్రించే అవకాశం ఉంటుంది. దీంతో జనం కచ్చితంగా ఇళ్లకే పరిమితమమై లాక్డౌన్ సక్రమంగా అమలవుతుంది. అందుకే పోలీసులు వేళల కుదింపునకే మొగ్గుచూపుతున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, మంగళవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను ఇక తొందరగా మూసేయాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు దుకాణదారులకు మౌఖికంగా ఈ మేరకు స్పష్టంచేసినట్టు తెలిసింది. బుధవారం నుంచి దుకాణాలను తొందరగా మూయాలని, బ్యాంకులను కూడా పని వేళలు తగ్గించుకోవాలని సూచించినట్టు దుకాణదారులు, బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా