newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

డబ్బుల్లేవు.. జీతాలు ఎలా ఇస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం

22-10-201922-10-2019 10:01:48 IST
2019-10-22T04:31:48.350Z22-10-2019 2019-10-22T04:31:42.094Z - - 24-02-2020

డబ్బుల్లేవు.. జీతాలు ఎలా ఇస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందని, అందుకే సమ్మెచేస్తున్న సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేందుకు కూడా సంస్థవద్ద డబ్బుల్లేవని టీఎస్ఆర్టీసీ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు టీఎస్ఆర్టీసీ దారుణ పరిస్థితిని హైకోర్టుకు వివరించారు.  సెప్టెంబర్‌ నెల జీతాలు సిబ్బందికి చెల్లించాలంటే మొత్తంమీద రూ.239.68 కోట్లు అవసరమని, అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాలో రూ.7.49 కోట్లే  ఉన్నాయని ఏజీ వివరించారు.

ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్‌ నెలకు జీతాలు చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించా లని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు తో పాటు మరొకరు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

‘ఏటా ఆర్టీసీకి రూ.1,200 కోట్ల మేరకు నష్టం వస్తోందని, సంస్థ రాబడిలో 58 శాతం జీతాలకే సరిపోతోందని,  2015లో ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం వల్ల ఆర్టీసీపై రూ.900 కోట్ల భారం పడిందనీ, 2017లో మధ్యంతర భృతి 16 శాతం ఇవ్వడం వల్ల రూ.200 కోట్లు వార్షిక భారం పడిందని ఏజీ రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు.  ఆర్టీసీ సొంతంగా 8,357 బస్సులు, 2,103 అద్దె బస్సులు నడుపుతోంది. వీటిని నడపటం ద్వారా ఏటా రూ.4,882 కోట్లు ఆదాయం వస్తుంటే, వ్యయం రూ.5,811 కోట్లు అవుతోందిని తెలిపారు. ఏటా ప్రభుత్వం ఆదుకుంటేనే ఆర్టీసీ నిర్వహణ జరుగుతోందని అదనపు ఏజీ చెప్పారు. 

సొంత రాబడి నిధులతో ప్రతి నెలా మొదటి వారంలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. దీంతో ప్రతి నెలా ప్రభుత్వ చేయూతతోనే జీతాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్టీసీ అప్పు రూ.4,709 కోట్లు. ఇందులో రూ.1660 కోట్లు క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ, పీఎఫ్, లీవ్‌ క్యాష్, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర చెల్లింపుల కోసం రూ.3,049 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం రుణాలు చేయాల్సి వచ్చిందని ఏజీ తెలిపారు.. ఈ ఏడాది ఆగస్టు నాటికి   నష్టాలు రూ.5,269.25 కోట్లకు పేరుకున్నాయి. రోజూ టికెట్ల ద్వారా రూ.10 కోట్లు, పండుగల సమయంలో రూ.13 కోట్లు డబ్బు వస్తుంది. సిబ్బంది సమ్మె వల్ల రూ.125 కోట్లకుపైగా అదనపు నష్టం వాటిల్లుతోంది’ అని పేర్కొన్నారు.

‘ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మె చేస్తే పరిస్థితులు చక్కబడతాయని ఆశించొద్దని హితవు పలికినా ఖాతరు చేయకుండా సమ్మెలోకి వెళ్లారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి’ అని ఏజీ వాదించారు.

అయితే పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. జీతాల నగదు సమాచారాన్ని ఆర్టీసీ తప్పుగా చెబుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఉన్నతాధికారుల జీతాలు రూ.100 కోట్ల వరకు చెల్లించిన యాజమాన్యం ఇంకా రూ.239 కోట్లు అవసరమని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిబ్బందికి జీతాలుగా చెల్లించాల్సింది రూ.140 కోట్ల లోపేనన్నారు. 

ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్నా 70 శాతానికిపైగా బస్సులు నడుపుతున్నామని మరో కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్న ప్రభుత్వం వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో హైకోర్టుకు వివరించలేదని చెప్పారు. ఎంత ఆదాయం వచ్చిందో వివరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం విచారణ 29కి వాయిదా పడింది. 

ఆర్టీసీ సిబ్బంది సమ్మెను ధిక్కారంగా భావించిన తెరాస ప్రభుత్వం గత 17 రోజులుగా సమ్మెను బేఖాతరు చేయడమే కాకుండా సెప్టెంబర్ నెలకు పనిచేసిన సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నిలిపివేసింది. ఇప్పుడు పది కోట్ల రూపాయల డబ్బు కూడా సంస్థ వద్ద లేదని చేతులెత్తేసింది. కానీ ఈ 17 రోజుల పాటు రాష్ట్రంలోని రహదారులపై తిరిగిన ప్రభుత్వ బస్సులు కనీసం పది కోట్ల డబ్బును కూడా సంపాదించలేకపోయిందా అనే ప్రశ్న వస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle