newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

డబుల్ బెడ్ రూం ఇళ్ళ సంగతేంటి?

16-05-201916-05-2019 17:23:41 IST
Updated On 27-06-2019 17:18:14 ISTUpdated On 27-06-20192019-05-16T11:53:41.664Z16-05-2019 2019-05-16T11:53:39.374Z - 2019-06-27T11:48:14.605Z - 27-06-2019

డబుల్ బెడ్ రూం ఇళ్ళ సంగతేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని టీపీసీసీ ఆరోపించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ విమర్శించారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఇళ్ళు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, అప్సుడు 2లక్షల 80 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేశారని ఆయన తెలిపారు.

కానీ ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తిచేసుకుని ఆరవ ఏట అడుగుపెడుతున్నా ఈ నివాస గృహాలకు అతీగతీ లేకుండా పోయిందని నిజాముద్దీన్ మండిపడ్డారు. యూనిట్ వ్యయం కూడా పెరిగిపోతోందన్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ పథకంలో ఇళ్ళ నిర్మాణాన్ని జాప్యం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 1810 రోజులైందన్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చేస్తే రోజుకి 199 ఇళ్ళు కట్టాలని, కానీ 9 ఇళ్ళు కూడా నిర్మించలేదన్నారు. ప్రైవేటు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రూ 8500 కోట్లకు గాను 3500 కోట్లు మాత్రమే నిధులు విడుదలచేసిందన్నారు. ఇప్పటివరకూ పూర్తిచేసిన ఇళ్ళు కేవలం 16,317 మాత్రమే అన్నారు నిజాముద్దీన్.

కొన్ని మురికివాడల్లో చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నవారిని సైతం ఖాళీచేయించారని,వారంతా నిలువ నీడలేకుండా రోడ్డున పడ్డారన్నారు. ఐడీహెచ్ కాలనీ పేరుతో కేసీఆర్ హడావిడి చేశారని, తర్వాత తమ హామీ సంగతి మరిచిపోయారన్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 2016లో త్వరితగతిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు కడతామన్నారని, కానీ కట్టలేదన్నారు.

ఎన్నికలు ముగిశాక తమ హామీని తుంగలో తొక్కారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళకోసం చేసుకున్న దరఖాస్తులను అధికారులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు చెత్తకుప్పలో పడేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇచ్చిందో, ఎంత వ్యయం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని నిజాముద్దీన్ డిమాండ్ చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle