newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఠాట్.. కేసీఆర్ సారు ఆమాట అనలే అంటే వినరే!

08-03-202008-03-2020 11:52:10 IST
Updated On 09-03-2020 17:06:46 ISTUpdated On 09-03-20202020-03-08T06:22:10.830Z08-03-2020 2020-03-08T06:22:08.736Z - 2020-03-09T11:36:46.166Z - 09-03-2020

ఠాట్.. కేసీఆర్ సారు ఆమాట అనలే అంటే వినరే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన సీఎం కేసీఆర్ సారు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అసలు ఎప్పుడూ చెప్పనేలేదట. అరె నిజం అధ్యక్షా.. ఊరికే మాటలు గాదు.. అధ్యక్షా.. ఇంటికో ఉద్యోగం సాధ్యమవుతుందా అసలు.. నేను అలివిగాని హామీలు ఇవ్వను అధ్యక్షా.. తెలంగాణ గురించి నాకు బాగా తెలుసు గనుకే అసలు ఆ మాటే నేను అనలేదు.. ఇది ఇంటికో ఉద్యోగంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెర్షన్.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో మొదలు కాగా శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మైకు ముందు ప్రసంగం మొదలు పెట్టారు. అంతే ఇంటికో ఉద్యోగం టాపిక్ రావడంతో ఆవేశంతో కూడిన వివరణాత్మక విశ్లేషణ మొదలుపెట్టారు.

అసలు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు అనడం కన్నా గ్రాండ్ సక్సెస్ కొట్టారు అని చెప్పుకోవడమే బెటర్. ఎందుకంటే.. ప్రతిపక్షాలు ఇప్పటిలో కోలుకునే పరిస్థితిలో లేవన్నది విశ్లేషకులు వివరించి చెప్తున్న మాట. తెలంగాణ పల్లె నుండి పట్నం వరకు ఎవరు దేనికి దాసోహం అవుతారన్నది కేసీఆర్ కి బాగా తెలిసిన వ్యవహారం కనుకే ఇది సాధ్యమైంది.

తొలిసారి సీఎంగా పీఠం మీద కూర్చున్న సమయం నుండి ప్రతిపక్షాలు కంట్లో నలుసై పీడిస్తుంటే టీడీపీని ఏపీకి కట్టకట్టి ప్యాక్ చేసి.. కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా చేసేశారు. ఇక అన్ని పార్టీలలో గట్టి నేతలను కారెక్కించుకుని ప్రజలను ఓన్ చేసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీతో విజయం సొంతం చేసుకొని అప్పటి వరకు ఉన్న సెంటిమెంట్ బ్రేక్ చేశారు.

ఇదంతా కేసీఆర్ ఒకవైపు మాత్రమే.. అయన ఉద్యమం నుండి మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు హామీల చిట్టా.. ఇచ్చిన వాగ్ధానాలు తీస్తే చాంతాడంత ఉన్నాయి. ఉద్యమం సమయంలో తొలి సీఎం దళితుడే.. ప్రత్యేక రాష్ట్రమిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న వాగ్ధానాలు ఇప్పటికీ అప్పుడప్పుడు కొందరు అయన గుర్తుచేస్తుంటారు.

అయితే అదంతా రాజకీయ వ్యవహారం.. మరి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి వస్తే అందులో ఇంటికో ఉద్యోగం ఉండనే ఉంటుంది. యు ట్యూబ్ లో కెళ్ళి చూస్తే కేసీఆర్ మాటాడిన ఇంటికో ఉద్యోగం మాటలు.. అయనలోని ఆవేశం అలా కళ్ళతోనే ఉండిపోతాయి. కానీ ఆయనేమో ఠాట్.. అసలు నేను ఆ మాట అననేలేదని సాగదీసి చెప్తారు.

పైగా నేను చెప్పినా అని ఎక్కడైనా ఆధారాలున్నాయా? ఏ ఎన్నికలలో అయినా మ్యానిఫెస్టోలో ఉందా? ఏ సమావేశంలో మాట్లాడానో స్పీచ్ ఉందా.. మీరు చూపిస్తారా అధ్యక్షా? అని ప్రశ్నిస్తారు. అయినా స్పీకర్ గారు ఎక్కడ తెస్తారు? తెచ్చినా మీకు చూపిస్తారా ? అందుకే నమ్మకం. అందుకే ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా అసలు వెనక్కు తగ్గరు.

ఇక్కడ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ కూటమిదే విజయం అనుకునేంత హైప్ వచ్చింది. కానీ ఒక్కసారి కేసీఆర్ వచ్చి మైకు పట్టుకున్నాక సీన్ మొత్తం మారిపోయింది. ఆగం ఆగం కావొద్దు సోయతో ఆలోచన చేయాలె అంటూ ప్రజలను ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నారు. అంతే.. కారు మెరుపు వేగంతో దూసుకెళ్లింది. దట్ ఈజ్ కేసీఆర్..!

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle