newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్రంప్ విందులో కేసీయార్ మార్క్ ట్రీట్‌మెంట్

25-02-202025-02-2020 10:12:13 IST
Updated On 25-02-2020 11:52:10 ISTUpdated On 25-02-20202020-02-25T04:42:13.540Z25-02-2020 2020-02-25T04:42:02.042Z - 2020-02-25T06:22:10.998Z - 25-02-2020

ట్రంప్ విందులో కేసీయార్ మార్క్ ట్రీట్‌మెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండురోజుల పర్యటన ఇవాళ ముగియనుంది. ఈ విందుకి తెలంగాణ సీఎం కేసీయార్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆహ్వానం పంపడం చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం జగన్ కు ఈ అవకాశం లభించలేదు. దీనిపై కూడా రాజకీయంగా చర్చ జరుగుతోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీయార్ భావిస్తున్నారు. 

రాష్ట్రపతి ఇచ్చే విందులో తెలంగాణ వంటకాలను చేర్చనున్నారు. తెలంగాణ ప్రత్యేకతను మరో సారి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. తెలంగాణ వంటకాలను రుచి చూసేది మాత్రం సామాన్యమైన వ్యక్తి కాదు. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయనకు మంచి గిఫ్ట్ లు కూడా ఇవ్వనున్నారు కేసీయార్. .25న రాష్ట్రపతి భవన్ లో డొనాల్డ్ ట్రంప్ తో విందులో పాల్గొనబోయే సీఎం చంద్రశేఖర్ రావు, ట్రంప్ కు ఓ తీయని జ్ఞాపకాన్ని కూడా అందివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. విందు భోజనం ముగిశాక ట్రంప్ కు కొన్ని కానుకలు సిద్ధం చేశారు.

తెలంగాణ వంటకాలైన సర్వపిండి, సకినాలు, నాటుకోడి పకోడి ఐటెమ్స్ ను ట్రంప్ కు రుచిచూపించబోతున్నారు కేసీఆర్. వీటిని నిష్ణాతులైన వంటగాళ్లతో ప్రిపేర్ చేయించడంతో పాటు వెరైటీగా ప్యాక్ చేయించారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వంటకాలకు ఓ బ్రాండ్ ఉండగా రేపు ట్రంప్ టేస్ట్ చేసిన తర్వాత వాటి బ్రాండ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ విందుకు కేవలం 90 నుంచి 95 మంది అథితులను మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకే ఈ ఆహ్వానాలు అందాయి. అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే అయితే ఈ విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు కావడం లేదు. ఆహ్వానం అందుకున్న మన్మోహన్ సింగ్ విందుకు రాలేకపోతున్నానని రాష్ట్రపతి కార్యాలయానికి విచారం వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఆహ్వానం అందలేదని తాము ఈ విందులో ఎలా పాల్గొంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle