newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ట్యాంక్ బండ్‌పై శనివారం 'సకల జనుల సామూహిక దీక్ష’

08-11-201908-11-2019 17:18:23 IST
2019-11-08T11:48:23.282Z08-11-2019 2019-11-08T11:48:19.080Z - - 19-11-2019

ట్యాంక్ బండ్‌పై శనివారం  'సకల జనుల సామూహిక దీక్ష’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికులు పట్టువీడడం లేదు. అక్టోబర్ 5న ప్రారంభమయిన సమ్మె ఇంకా కొనసాగుతూనే వుంది. తాజాగా హైకోర్టులో సమ్మె, ప్రైవేటీకరణ అంశాలపై విచారణ జరిగింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 

కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను సమర్పించాలని ఆదేశించింది.  పిటిషన్‌పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. శనివారం పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్‌కు 'సకల జనుల సామూహిక దీక్ష'గా పేరు మార్చారు. హైకోర్టు సూచనలు గౌరవించి వెంటనే చర్చలు జరపాలని ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. 

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని. దానిని కాలరాయాలని, బెదిరించాలని చూడడం తగదన్నారు అఖిలపక్ష నేతలు. ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ట్యాంక్‌బండ్‌ దగ్గర నిరాహారదీక్షలు చేస్తామని, ముందస్తు అరెస్ట్‌లు చేయడం తగదన్నారు సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి.

తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని, ఇప్పటికే 24 మంది ఆర్టీసీ కార్మికులు మరణించినా సమ్మె కొనసాగిస్తున్న కార్మికులకు అన్నివర్గాలు బాసటగా నిలవాలని అఖిలపక్ష భేటీలో నేతలు కోరారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ కోరారు. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరించలేదని, హైకోర్టు మాటలు కూడా సీఎం పెడచెవిన పెడుతున్నారని సీపీఎం నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికులు ఆర్టీసీ జేఏసీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

బీడీ కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి మద్దతుగా మద్దతుగా ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 35 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. 

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

   31 minutes ago


జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

   an hour ago


ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

   an hour ago


 ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

   2 hours ago


జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

   2 hours ago


పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

   3 hours ago


ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

   4 hours ago


‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

   4 hours ago


‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

   4 hours ago


శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle