newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెస్టుల సంఖ్య పెరిగితే కేసులు పెరుగుతాయా.. అవునంటున్న తెలంగాణ

08-08-202008-08-2020 13:23:16 IST
2020-08-08T07:53:16.477Z08-08-2020 2020-08-08T07:53:09.143Z - - 15-04-2021

టెస్టుల సంఖ్య పెరిగితే కేసులు పెరుగుతాయా.. అవునంటున్న తెలంగాణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతాయని అమెరికా, ఆంధ్రప్రదేశ్ దాకా గత రెండు మూడు నెలల అనుభవాలు పదే పదే చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కూడా ఈ వాస్తవాన్ని నిరూపిస్తోంది.. హైకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిని అనుసరించి తెలంగాణాలో కరోనా పరీక్షలను ముమ్మరం చేస్తున్న క్రమంలో మొత్తం కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 75 వేలకు చేరుకోగా ఒకే రోజు 2,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం ఉదయానికి తెలంగాణలో 23,495 కరోనా కేసులు నమోదు కాగా ఒక్కరోజులో 2,207 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తెలిపింది. వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 5,66,984 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 75,257 కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 601కి చేరుకుంది. ఇక ఒకేరోజు నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి.

తెలంగాణలో ఒక రోజులో 12 మంది మరణించారని,  మొత్తం మరణాలు 601కి చేరగా, ప్రస్తుతం 21,417 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, వారిలో 14,837 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. తాజాగా 1,136 మంది బాధితులు డిశ్చార్జి కాగా, మొత్తంగా ఇప్పటివరకు 53,239 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని. రాష్ట్రంలో రికవరీ రేటు 70.7 శాతంగా ఉందని, ఇది దేశ సగటు (67.62 శాతం) కంటే ఎక్కువ అని ఆయన వివరించారు.

కాగా శుక్రవారం ఉదయానికి జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 532 కేసులు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 196, వరంగల్‌ అర్బన్‌ 142, మేడ్చల్‌ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్‌ 87, కామారెడ్డి 96, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, నిజామాబాద్‌ 89, పెద్దపల్లి జిల్లాలో 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వీరవిహారం చేస్తూనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు 75 వేల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. 

ఏపీలో ఒక రోజులో 63 వేల కేసులు.. 10,171 మందికి పాజిటివ్‌

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,20,464కి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు మొత్తం 62,938 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు 23,62,270కి చేరాయి. కొత్తగా 10,171 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. తాజాగా 89 మంది మృతితో మొత్తం మరణాలు 1,842కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 84,654 ఉన్నాయి.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle