newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెస్టుల్లేకుండా గ్రీన్ జోన్లా.. ప్రభుత్వ ఆలోచనేంటి?

21-05-202021-05-2020 10:36:25 IST
Updated On 21-05-2020 11:38:52 ISTUpdated On 21-05-20202020-05-21T05:06:25.210Z21-05-2020 2020-05-21T05:06:23.075Z - 2020-05-21T06:08:52.296Z - 21-05-2020

టెస్టుల్లేకుండా గ్రీన్ జోన్లా.. ప్రభుత్వ ఆలోచనేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పేషంట్ ఉన్న ఇల్లు తప్ప మరెక్కడా రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు లేనే లేవు. ఇది సాక్షాత్తు సీఎం కేసీఆర్ చెప్పిన మాట. ఇప్పుడు తెలంగాణలో కరోనా పరిస్థితి చూస్తే ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా కరోనా లేదు. ఒక్క హైదరాబాద్ పరిధిలో తప్ప.  బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో కూడా రాష్ట్రంలో 27 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 15 గ్రేటర్ పరిధిలో కాగా మిగతా 12 వలస కార్మికులవని చెప్పింది.

ఇక గత రెండు వారాలుగా 25 జిల్లాలలో ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పిన ప్రభుత్వం మూడు జిల్లాలలో అసలు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రాలేదని చెప్పింది. కానీ హైకోర్టు మాత్రం రాష్ట్రప్రభుత్వం అసలు కరోనా టెస్టులు ఎక్కడ నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరెక్కడా టెస్టులు నిర్వహించకుండా కేసులే లేవంటే ఎలా అని ప్రశ్నించింది.

సూర్యాపేట జిల్లాలో టెస్టులు ఆపేయడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌ సంకినేని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిర్మల్ జిల్లాకు వలస కూలీలు భారీ సంఖ్యలో వచ్చారని కానీ ఇక్కడ ఏప్రిల్ 22 తర్వాత ఒక్క టెస్ట్ కూడా చేయలేదని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.

నిజానికి ఏప్రిల్ 22 తర్వాత తెలంగాణ ప్రభ్హుత్వం రాష్ట్రంలో ఎక్కడ టెస్టులు చేసినట్లుగా లేదని వైద్య వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చివరికి హైదరాబాద్ తర్వాత ఎక్కువగా కేసులు నమోదైన సూర్యాపేటలో కూడా ఏప్రిల్ 22 తర్వాత టెస్టులు ఆపేశారన్నది సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే.. తెలంగాణ ప్రభుత్వం టెస్టులను తగ్గించేసి అన్నీ గ్రీన్ జోన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్నదే ఆసక్తిగా మారింది. టెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినా... మాకు తెల్వదా? ఎవరికి చేయాలో? అని సీఎం.. గుడెద్దు చేలో పడ్డట్లుగా అందరికీ టెస్టులు చేయరని ఆరోగ్యమంత్రి సమాధానమిస్తారు? మరి ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు టెస్టులు చేయడం లేదు?

కరోనాతో కలిసి జీవించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాదిరే ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ఇప్పటికే సెలవిచ్చారు. ఎలాగూ కలిసి బ్రతకాలి కనుక ప్రజలే అలవాటు పడిపోతారని టెస్టులు తగ్గించేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవిధంగా ఇటలీ, లండన్ లాంటి దేశాలు తొలి నాళ్ళలో హార్డ్ ఇమ్యూనిటీ వస్తుందని కరోనా తేలికగా తీసుకున్నారు.

కానీ అక్కడ ఆ విధానం తీరాన్ని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా హార్డ్ ఇమ్యూనిటీ ఆలోచనకు వచ్చేసిందా? అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే.. టెస్టులు శాతం తగ్గిస్తే వైరస్ వ్యాప్తి చెందితే వృద్దులు, పిల్లలు, ఇప్పటికే వ్యాధులతో పోరాడే వాళ్ళు కోలుకోవడం కష్టమే అవుతుంది. వారిలోనే మరణాల శాతం అధికంగా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారికంగా 40 మంది చనిపోయారు. టెస్టుల సంఖ్య పెంచకపోతే వ్యాప్తితో మరణాల శాతం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ ఆందోళనలు పట్టించుకుంటుందా?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle