newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెంత్ పరీక్షలపై వీడని ఉత్కంఠ... హైకోర్టు ఏం చెబుతుందో?

05-06-202005-06-2020 19:34:58 IST
2020-06-05T14:04:58.744Z05-06-2020 2020-06-05T14:04:47.512Z - - 22-04-2021

టెంత్ పరీక్షలపై వీడని ఉత్కంఠ... హైకోర్టు ఏం చెబుతుందో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఏడాది పదవతరగతి విద్యార్ధులు అసలు పరీక్ష కంటే కరోనా అగ్నిపరీక్షతో సతమతం అవుతున్నారు. లాక్‌‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో రెండురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. అది శనివారం కూడా కొనసాగనుంది.  జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. ఈ క్రమంలో కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. 

ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్‌ అయితే రెగ్యులర్‌ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని శనివారం చెబుతామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ అన్నారు. దీంతో శనివారం కంటైన్మెంట్‌ జోన్లు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మళ్లీ  శనివారానికి వాయిదా వేసింది. 

మరోవైపు హాస్టళ్ళో ఉండి పరీక్షలు రాయబోయే వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఇతర విద్యార్థులను..ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం కలిగించింది. విద్యార్థుల వివరాలను తమ జిల్లా డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఉండి చదువుకున్న విద్యార్థి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారైతే..నిజామాబాద్ జిల్లాలో తన ఊరికి దగ్గర ఉన్న పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయవచ్చు. అసలు పరీక్షలు జరుగుతాయా, మళ్ళీ వాయిదా పడతాయా  కరోనా వైరస్ ఉధృతితో రద్దవుతాయా అనేది ఇంకా తేలలేదు. శనివారం హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం లక్షలాదిమంది విద్యార్ధులు, అంతకుమించి వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు ఇతర రాష్ట్రాల బాటలోనే పరీక్షలు రద్దుచేయాలని సోషల్ మీడియాలో ట్వీట్లు పెరుగుతున్నాయి. #CancelTSExamsPromoteStudents హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే వుంది. 

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle