newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

టెండర్ లక్.. తెలంగాణ ఎక్సైజ్‌కి యమా కిక్

18-10-201918-10-2019 09:10:10 IST
Updated On 18-10-2019 15:30:49 ISTUpdated On 18-10-20192019-10-18T03:40:10.775Z18-10-2019 2019-10-18T03:39:59.580Z - 2019-10-18T10:00:49.692Z - 18-10-2019

టెండర్ లక్.. తెలంగాణ ఎక్సైజ్‌కి  యమా కిక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఖజానాకు మద్యం కిక్ రాబోతోంది. ఈసారి మద్యం షాపుల టెండర్లు భారీగా రావడం, ఫీజుగా రావడంతో అధికారులు ఖుషీ అవుతున్నారు. ట్యాక్స్ పేయర్స్ సంగతి అలా ఉంచితే.. మద్యం షాపులను దక్కించుకునేందుకు యమా పోటీ ఏర్పడింది. తెలంగాణ ఎక్సైజ్‌ అధికారుల ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయి. టెండర్‌ ఫీజు రెండింతలు చేయడంతో దరఖాస్తులు రావేమోననే సందేహాలు వ్యక్తం అయినా... అవి పటాపంచలు అయ్యాయి. 

కొత్త ఎక్సైజ్‌ మార్గదర్శకాలు ఆ శాఖకు కాసుల పంట పండించాయి. 2019–21 సంవత్సరాలకు రాబోయే లైసెన్స్ ల కోసం 2,216 దుకాణాలకుగాను 48,243 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా రూ.964 కోట్లు ఖజానాకు చేరడం ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఊరటనిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నేడు డ్రా తీయనున్నారు.

29 షాపులకు మాత్రం ఇవాళ లాటరీ తీసే అవకాశం కనిపించడంలేదు. ఆయా దుకాణాలకు నాలుగుకంటే తక్కువగా దరఖాస్తులు రావడం తో, దరఖాస్తులను అడ్డుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపాకే ఆ 29 షాపులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. 

తెలంగాణ వ్యాప్తంగా ఖమ్మంలో షాపుల కోసం క్యూకట్టారు. రంగారెడ్డి ఉమ్మ డి జిల్లాలో అత్యధికంగా 8,733, హైదరాబాద్‌లో అత్యల్పంగా 1,499 దరఖాస్తు లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఒక్కో దుకాణానికి 48 మంది టెండర్‌ వేయడం ఎక్సైజ్‌ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీకి చెందిన వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సగటున 8.7 దరఖాస్తులు రాగా, పెద్దపల్లి జిల్లాలో 9.9 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ వ్యాపారుల తాకిడితో సరిహద్దు జిల్లాలైన నల్ల గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 

గతంతో పోలిస్తే ఈసారి టెండర్‌ ఫీజు పెంచారు. అయినా భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ ప్లాన్ వర్కవుట్ అయిందని అంటున్నారు.  తెలంగాణ ఎక్సై.జ్ ఆదాయం పెరగడానికి ఏపీకి చెందిన వ్యాపారులు కూడా ఈసారి మన రాష్ట్రంలోని షాపులపై దృష్టి సారించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.  

మరోవైపు ఈ సారి నిబంధనలు కాస్త కఠినంగా ఉన్నాయి. ఈ టెండర్లలో దరఖాస్తుదారు తప్పనిసరి పాల్గొనాలి. లేనిపక్షంలో అతని దరఖాస్తును డిస్‌క్వాలిఫై చేయనున్నట్లు అధికారులు  చెబుతున్నారు.

అదేవిధంగా రూ.5లక్షల పెనాల్టీ విధించనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా లక్కీడ్రా సమయంలో దరఖాస్తుదారు లేనిపక్షంలో అతని పేరును తొలగిస్తారు. ఇదిలా ఉంటే లక్కీడ్రాలో షాపు దక్కిన వ్యక్తి వార్షిక అద్దె పరంగా రెండు సంవత్సరాలది కలిపి 8 విడతల్లో చెల్లించాల్సి ఉండగా, మొదటి విడత 1/8వ వంతు అప్పుడే చెల్లించాల్సి ఉంటుంది.

దీని కోసం ఇదే ప్రాంగణంలో బ్యాంక్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. లక్కీడ్రా రోజే 31 దుకాణా లకు సంబంధించి రెండేళ్ల లైసెన్స్‌ ఫీజులో 1/8వ వంతు శుక్రవారమే వసూలు కానుంది. దీంతో ఖజానా కళకళలాడనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle