newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీ కాంగ్రెస్ కుమ్ములాటకి అడ్డూ అదుపు లేదా?

06-01-202006-01-2020 13:06:06 IST
2020-01-06T07:36:06.945Z06-01-2020 2020-01-06T07:36:04.722Z - - 14-04-2021

టీ కాంగ్రెస్ కుమ్ములాటకి అడ్డూ అదుపు లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికార పార్టీ వేళ్లూనుకుపోతూ దశాబ్దాల చరిత్ర గల పార్టీలను నామరూపాల్లేకుండా చేసేందుకు పక్క ప్రణాళిక బద్దంగా లెక్కలేసుకుంటూ దూసుకుపోతుంది. ఒకపక్క చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం తన మార్క్ కొట్లాట నుండి బయటపడలేకపోతుంది. ఒకపక్క ఎన్నికలు ముంచుకొస్తున్నా నేతల మధ్య ఆధిపత్య కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు.

ఇప్పటికే టీకాంగ్రెస్ పార్టీలో సీనియర్ - జూనియర్ నేతల మధ్యపోరు.. పదవుల కోసం పోటీపడే వారి మధ్య పోరు ఉండగా తాజాగా కుల ప్రాతిపదికన కూడా మరో అంతర్గత కుమ్ములాట జరుగుతుందని బయటపడింది. ప్రస్తుతానికి పిసిసి చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే పదవి నుండి తప్పుకుంటానని రెండు రోజుల క్రితమే చెప్పారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఇది జరగొచ్చని కూడా తెలిసిందే.

అయితే ఈలోగానే.. కొందరు సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణల ఫిర్యాదులు చేశారు. సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, దామోదర రాజనర్సింహులు తదితరులు తాజాగా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాతో సమావేశమై ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. పార్టీలో పరిస్థితులపై అయనకి వివరించినట్లుగా చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ సామజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల భర్తీ చేపడుతున్నారని.. ఇప్పుడు టికెట్లలో కూడా ఒక్క సామజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ నిర్ణయాల వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలు పార్టీకి దూరం అయిపోతున్న్నాయని ఈ సీనియర్ నేతల వాదనగా కాగా పార్టీలో ప్రక్షాళన అవసరం అని అధిష్టానానికి సమాచారమిచ్చారు.

కాగా, నిజానికి మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీలో ప్రక్షాళన ఉంటుందని ముందే అందరికీ తెలుసు. కానీ.. నేతలు ఫిర్యాదులకి క్యూ కట్టారు. ఇక ముందుగా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ ఎన్నికల వేళ ఇలా ఫిర్యాదులు.. కుమ్ములాటతో అంటకాగితే పార్టీ అధఃపాతాళానికి చేరడం ఖయామనే విషయాన్ని ఈ నేతలు ఎందుకు గుర్తించడం లేదన్నది కొందరి వాదన.

కాగా, ఇప్పటికే పార్టీలో సీనియర్ - జూనియర్ వార్ నడుస్తుంది. ఇప్పుడు సీనియర్ నేతలలో కూడా మరో గ్రూపు నడుస్తుందని స్పష్టంగా వాళ్లే తేల్చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టిన గులాబీ అధిపతికి ఈ కుమ్ములాటలే వరంగా మారగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ప్రజలలో మూడురంగుల పార్టీ స్థానం ఏమిటి? అన్నది మరోసారి స్పష్టంగా తేలనుంది. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle