టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మెడకు ఈడీ ఉచ్చు
02-07-202002-07-2020 12:08:13 IST
Updated On 02-07-2020 19:03:59 ISTUpdated On 02-07-20202020-07-02T06:38:13.977Z02-07-2020 2020-07-02T06:37:57.550Z - 2020-07-02T13:33:59.115Z - 02-07-2020

ప్రముఖ శాటిలైట్ వార్తా ఛానెల్ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడి కేసు నమోదు చేసింది. అక్రమంగా నిధులు విత్ డ్రా చేసినందుకు రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్‌నుంచి 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను విత్ డ్రా చేసిన రవిప్రకాశ్, మరో ఇద్దరు ఉద్యోగులు. అనుమతుల్లేకుండా డబ్బులు విత్ డ్రా చేసినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నూతన యాజమాన్యం. గతంలోనే ఈ ఫిర్యాదుపై రవి ప్రకాష్ తో పాటు పలువురు పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో కేసు వేగం పుంజుకుంది. రవిప్రకాష్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించాడన్న అంశంపై ఆరా తీయనుంది ఈడీ. ఇదే అంశంపై రవిప్రకాష్ ను విచారించనుంది ఈడీ. 2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు యాజమాన్యానికి తెలియకుండా రవి ప్రకాష్ నిధుల్ని ఉపసంహరించినట్లుగా చెప్తున్నారు. ఈ నిధుల విషయంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేసు నమోదు చేశాయి. 2019 అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. గతంలో ఆయన మీద టీవీ9 యాజమాన్యం ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్ టీవీ 9 నిధులు ఫోర్జరీ డాక్యుమెంట్ లతో మళ్ళించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై నమోదైన కేసులు తెలిసిందే. ఎంవీకేఎన్ మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి రవి ప్రకాష్ సొంత మొబైల్ టీవీకి టీవీ9 లోగోలను యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారని , టీవీ 9 కు వచ్చే యాడ్స్ ను కూడా సదరు మొబైల్ టీవీ కి మళ్ళించారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీవీ 9 లోగోను మెజార్టీ వాటాదారులకు తెలీకుండా అమ్మేశారనే ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై అప్పట్లోనే కేసు నమోదయ్యింది.ఇప్పటికే నమోదైన కేసులతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న రవి ప్రకాష్ పై ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. ఆయన మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. ఈయనపై ఈడీ ఇప్పుడు విచారణ జరపనుంది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా