newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

టీపీసీసీ చీఫ్‌ పదవి.. రేవంత్‌కు అందని ద్రాక్షేనా?

07-11-201907-11-2019 07:35:55 IST
2019-11-07T02:05:55.417Z07-11-2019 2019-11-07T02:05:51.697Z - - 15-08-2020

టీపీసీసీ చీఫ్‌ పదవి..  రేవంత్‌కు అందని ద్రాక్షేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్టీల్లో ఉన్నతస్థాయి పదవుల్లో ఉండాలని ప్రతీఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవటం సర్వసాధారణం. అంచెలంచెలుగా ఎదుగుతూ వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అవి అందవచ్చు.. అందకపోవచ్చు. దీంతో చిన్నచిన్న పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డికి వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత స్థానమైన టీపీసీసీ చీఫ్‌ పదవి అందినట్లే అంది చేజారుతున్నట్లు రేవంత్‌ వర్గీయులు మదనపడిపోతున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌ వ్యతిరేక వర్గం ఏకంకావటంతో నోటికాడికొచ్చిన పండు నేలపాలైనట్లు.. ఇక పదవిని అదిష్టించడం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో చేజారిపోతుండటం ఆయన వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీలో చేరిన రేవంత్‌కు అతికొద్దికాలంలోనే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వరించింది. అంతే స్థాయిలో రేవంత్‌ యాంటీ వర్గం కూడా పార్టీలో అదే స్థాయిలో ఏర్పడుతూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి ఓటమిపావటం, ఆ తరువాత పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి గెలుపొందటం చకచకా జరిగిపోయాయి..

అప్పటి నుంచి మళ్లీ రేవంత్‌ తన దూకుడును పెంచాడు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గెట్‌గా చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికార పార్టీ నేతలుసైతం కాంగ్రెస్‌ పార్టీ అంటే రేవంతే అన్న రీతిలో రేవంత్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. దీంతో రేవంత్‌ పాపులారీటి అమాంతం పెరిగింది. కాంగ్రెస్‌లో తరువాతి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డేనని పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగింది.

దీనికితగ్గట్టు ఉత్తమ్‌కుమార్‌ను తొలగిస్తున్నట్లు ఊహాగానాలు రావటం.. రేవంత్‌ కుటుంబ సభ్యులో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను కలిసిరావటంతో ఇక తెలంగాణ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డే అని అటు కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు.. ఇతర పార్టీల్లోని నేతలు భావించారు. ఇంతలోనే రాష్ట్రంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వటం సబబుకాదని అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అధిష్టానం సైతం మున్సిపల్‌ ఎన్నికల తరువాతకు టీపీసీసీ చీఫ్‌ పదవి ఎంపిక ను వాయిదా వేసింది.

ఈలోపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు రావటం.. అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్‌ ఒకవైపు.. పార్టీలోని సీనియర్లంతా ఒకవైపు కావటం చకచకా జరిగిపోయాయి. హుజూర్‌నగర్‌లో పార్టీ ఓటమి అనంతరం మళ్లీ టీపీసీసీ చీఫ్‌ పదవి ఎంపిక తెరపైకి వచ్చింది. మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై తీవ్ర చర్చసాగింది. ఈ చర్చలో సీనియర్‌లకే టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వాలని సీనియర్‌ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఇలా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.

వీరిలో ఎవరికిచ్చినా మాకు అభ్యంతరం లేదని రేవంత్‌కు టీపీసీసీ చీఫ్‌ ఇవ్వటానికి వీలులేదని పలువురు సీనియర్‌ నేతలు కుంతియా వద్ద కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. దీంతో చేతికందినట్లే అంది టీపీసీసీ ఛీప్‌ స్థానం చేజారిపోతుందని రేవంత్‌ వర్గీయులు తీవ్ర మనోవేధనకు

గురవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. మరి పార్టీ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ పదవిని సీనియర్ల మాట కాదని రేవంత్‌కు కట్టబెడుతుందా..? సీనియర్ల డిమాండ్‌కు తలొగ్గి ఇతరకు నేతలకు కట్టబెడుతుందో వేచి చూడాల్సిందే..

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   32 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   16 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle