టీపీసీసీకి కొత్త సారథి ఎవరో? పెరుగుతున్న ఉత్కంఠ!
18-01-202018-01-2020 08:45:36 IST
Updated On 20-01-2020 17:30:09 ISTUpdated On 20-01-20202020-01-18T03:15:36.174Z18-01-2020 2020-01-18T03:15:29.067Z - 2020-01-20T12:00:09.733Z - 20-01-2020

తెలంగాణలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. నేతల దృష్టి అంతా పీసీసీ సారథి ఎవరనేదానిపైనే వుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీలో పీసీసీకి నూతన సారథిగా శైలజానాథ్ ని నియమించింది. రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి శైలజానాథ్ కి పట్టం కట్టింది. తెలంగాణలో ఏంచేస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. మాజీ ఎంపీ వీహెచ్ సైతం ఈసారి ఏపీ తరహాలోనే అగ్రవర్ణాలకు కాకుండా బీసీ నేతకు పట్టం కట్టాలని సూచిస్తున్నారు. ఏపీ సంగతి పూర్తి కావడంతో టీపీసీసీ కొత్త చీఫ్ అంశం తెలంగాణలో మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలోని పలు సమీకరణాల నేపథ్యంలో పార్టీ విధేయతకు ప్రాధాన్యమివ్వాలా? లేక ప్రజాకర్షణకు పెద్దపీట వేయాలా? అనేదానిపై అధిష్టానం ఆలోచిస్తోంది. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తమకున్న అర్హతలతో పోటీ పడుతున్నా ప్రధానంగా రేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. వీరే కాకుండా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీసీసీ అధ్యక్ష పదవి కోసం గిడుగు రుద్రరాజు, పళ్లంరాజుతోపాటు పలువురి పేర్లు చర్చకు వచ్చినా.. అధిష్ఠాన వర్గం తమ సొంత నిర్ణయం మేరకు శైలజానాథ్‌ను నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడిని విషయంలోనే అదే పంథా అనుసరిస్తారని అంటున్నారు. వరుస ఎన్నికల్లో డీలా పడిన పార్టీకి నూతన నాయకత్వం ఉత్తేజాన్నినింపేందుకు గట్టి కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచే నూతన సారథిని ఎంపిక చేయాలని అధిష్ఠానం భావిస్తే రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి మధ్యనే పోటీ ఉంటుంది. అలాగే విశ్వాసానికే ఓటు వేస్తే చిన్నారెడ్డికి అవకాశం రావచ్చంటున్నారు. యువనాయకత్వానికి, పార్టీకి నూతనోత్తేజం అందించాలనే అంశాన్నే పరిశీలిస్తే రేవంత్ రెడ్డికే అవకాశం రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే శ్రీధర్‌బాబు, సంపత్ కుమార్ వంటి వారికి పదవుల్లో ప్రాధాన్యత దక్కవచ్చు. మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే నూతన సారథిని నియమించే అవకాశం ఉంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా