newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

20-01-202020-01-2020 12:25:20 IST
2020-01-20T06:55:20.719Z20-01-2020 2020-01-20T06:55:18.628Z - - 26-05-2020

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో టీడీపీ స్థానం ఎక్కడా అంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే గతంలో క్షేత్ర స్థాయి నుండి బలంగా కమిటీలతో స్థాపితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థాయికి చేరుకుంది. ప్రజలలో పార్టీపై అభిమానం ఉందని కొందరు చెప్పినా అది కళ్ళకు కనిపించే పరిస్థితి లేదు. తిరిగి అసలు పార్టీ పుంజుకొని తమకి క్యాడర్ ఉందని నిరూపించుకొనే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.

గతంలో టీడీపీ క్షేత్రస్థాయిలో బిల్డ్ చేసుకున్న క్యాడర్ ను ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కొంతమేర సొంతం చేసుకుంది. టీడీపీ నుండి గత ప్రభుత్వంలో నేతలు రానీ.. కార్యకర్తలే రానీ టీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా మారిందంటే అది టీడీపీ నుండి వచ్చిన వలసల వలననే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలలో టీడీపీ కార్యాలయాలు.. పార్టీ జెండా దిమ్మెలు అలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఇక టీడీపీ హయంలో చేసిన అభివృద్ధి తాలూకు శిలాఫలకాలు గ్రామానికి నాలుగుగైదు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇక అర్బన్ ప్రాంతాలతో పాటు.. సిటీ పరిధిలో ఆ పార్టీకి గట్టి కార్యకర్తలతో పాటు నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన టీడీపీపై అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారన్నది అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన నిజమే. అయితే ఏపీలో సమస్యలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిస్తేజంలో ఉన్న క్యాడర్ ను పార్టీ అధిష్టానం కదిలించే ప్రయత్నం చేయలేదు.

తాజాగా మున్సిపల్ ఎన్నికలలో కూడా టీడీపీ అధిష్టానం పొత్తులు, టికెట్లు, పెత్తనం అంతా తెలంగాణ నేతలకే వదిలేసింది. ఈక్రమంలో ఒకటీ రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల గట్టి నాయకులే పోటీకి దొరకలేదు. ఈక్రమంలో మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఆసక్తికర సంఘటనను చోటు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీలలో ఉన్న బడా నేతలు టీడీపీకి కాస్తో కూస్తో ఉన్న ఓటు బ్యాంకును తమవైపుకి తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ప్రధాన శత్రువు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాగా మిగతా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లతో సంబంధాలు సామరస్యంగానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ చాలాకాలంగా పొత్తులో ఉండగా తెలంగాణ బీజేపీ నేతలకు టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీతో అయితే మొన్నటి ఎన్నికలలో పొత్తులు పొడిచిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలోనే టీడీపీ అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి .. తెలంగాణలో ముఖ్యంగా సిటీ, అర్బన్ ప్రాంతాలలో అభివృద్ధి జరిగింది అంటే అది టీడీపీ-బీజేపీ ప్రభుత్వాలలోనే అని అది కొనసాగించాలంటే మళ్ళీ బీజేపీకి పట్టం కట్టాలని పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ క్యాడర్ లో టీఆర్ఎస్ పార్టీపై ఉన్న శత్రుత్వాన్ని తమదిగా చెప్పుకుంటున్నారు. శనివారం ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై తన పోరాటానికి టీడీపీ కార్యకర్తల మద్దతు కావాలని.. సమిష్టిగా కృషి చేస్తేనే విజయాలు సాధించగలమని పేర్కొనడం విశేషం. వీళ్ళు టీడీపీ క్యాడర్ ను ఓట్లు అడిగితే మరి టీడీపీ తరపున పోటీచేసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి?!

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle