newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఎస్ఆర్జేసీ విద్యార్ధులకు గుడ్ న్యూస్... పరీక్ష ఎప్పుడంటే?

21-08-202021-08-2020 12:18:41 IST
Updated On 21-08-2020 16:08:01 ISTUpdated On 21-08-20202020-08-21T06:48:41.580Z21-08-2020 2020-08-21T06:47:35.985Z - 2020-08-21T10:38:01.236Z - 21-08-2020

టీఎస్ఆర్జేసీ విద్యార్ధులకు గుడ్ న్యూస్... పరీక్ష ఎప్పుడంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వల్ల అనేక ఎంట్రన్స్ పరీక్షలు రద్దయ్యాయి. తెలంగాణలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెరిగింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 రాయడానికి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

వాస్తవానికి ఈ పరీక్షకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ.

తాజాగామరోసారి దరఖాస్తు గడువును పెంచింది. ఆసక్తి గల విద్యార్థులు 2020 సెప్టెంబర్ 5 వరకు టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2020 కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పరీక్షను కూడా వాయిదా వేసింది. పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనుంది. ముందుగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ మే 10న జరగాలి. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ ఎగ్జామ్ వాయిదా పడింది. ఇప్పటికీ పరీక్ష నిర్వహంచే అవకాశం లేదు కాబట్టి దరఖాస్తు చేయడానికి విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది.

తెలంగాణలో టెన్త్ పాసైన విద్యార్థులు గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం అప్లై చేయొచ్చు. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు వున్నాయి. టెన్త్ విద్యార్థులు దరఖాస్తు చేయాలంటే https://tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు వినియోగించుకోవచ్చు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle