newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

12-07-202012-07-2020 12:39:18 IST
2020-07-12T07:09:18.369Z12-07-2020 2020-07-12T07:08:34.389Z - - 15-04-2021

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా అన్ని ప్రవేశపరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. అకడమిక్ పరీక్షలు రద్దవుతున్నాయి. తాజాగా నేషనల్ ఓపెన్ స్కూల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ, సీనియర్‌ సెకండరీ కోర్సుల పరీక్షలన్నింటిని రద్దు చేసినట్లు ఎన్‌ఐఓఎస్‌ డైరెక్టర్‌ (ఎవాల్యుయేషన్‌) బి.వెంకటేషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

పరీక్షలు మార్చిలో ప్రారంభం కావల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని జులై 17కి వాయిదా వేశారు. అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి రాని కారణంగా పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. గతంలో ఆయా సబ్జెక్ట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని వారిని ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేస్తారు. నాలుగు సబ్జెక్టులు రాసిన వారికి మెరుగైన మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను, మూడు సబ్జెక్టులు రాసిన వారికి రెండింటిని, రెండు, ఒకటి సబ్జెక్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల విషయంలో థియరీలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. 

అసలు పరీక్షలు రాయని వారు, మొదటి సారి కోర్సుల్లో ప్రవేశించిన వారి విషయంలో ట్యూటర్లు ఇచ్చే మార్కులు, ఏవైనా ప్రాక్టికల్స్‌కు హాజరై ఉంటే అందులో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

మరోవైపు తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్‌ కాలేజెస్‌ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షకు దరఖాస్తు గడువును ఆగస్టు 5, 2020 వరకు పొడిగించారు. ఈ పరీక్ష ద్వారా గురుకుల కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లిష్‌ మీడియం-ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాలు పొందొచ్చు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత  ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటిస్తారు. గతంలో అయితే ఇప్పటికే ఎంట్రన్స్ టెప్ట్ ముగిసి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభ కావాలి. కానీ ఇప్పటికీ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం మరోసారి పొడిగించింది. తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కాలేజీలు, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి.. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle