newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

14-10-201914-10-2019 22:54:55 IST
2019-10-14T17:24:55.313Z14-10-2019 2019-10-14T14:31:23.942Z - - 26-02-2020

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ సమ్మె తీవ్రంగా మారుతుంది. కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు రోడ్ల మీదకి చేరి నిరసనలు ఉదృతం చేస్తున్నాయి. ఇప్పటికే సమ్మెకి రాజకీయ పార్టీలు, కొన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టిన ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్రంలో పలు ఉద్యోగ సంఘాలను కూడా ఏకం చేసి తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అభద్రతా భావంలో ఉన్న పలు ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకి మద్దతిచ్చాయి. త్వరలోనే కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు రాష్ట్రంలో రెవెన్యూ సంఘాలు మద్దతు ప్రకటించగా ఓయూ జేఏసీ విద్యార్థులు ఏకంగా ధర్నాలు, నిరసనలతో హోరెత్తించేందుకు ప్రణాళికను కూడా ప్రకటించారు. ఆర్టీసీ ప్రకటించిన ప్రణాళిక తేదీ వరకు ఓయూ జేఏసీ కూడా ధర్నాకు, నిరసనలు, బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ జేఏసీ కలిసిరారవడం ఆర్టీసీ కార్మికులలో కొంత ధైర్యం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ముఖ్య ఉద్యోగ సంఘమైన ఎన్జీఓలు మాత్రం ఆర్టీసీ సమ్మెకి మొహం చాటేసినట్లే కనిపిస్తుంది.

రెండు రోజుల క్రితం మీడియా ముందుకొచ్చిన ఎన్జీఓ సంఘాల నేతలు ఆర్టీసీ సమ్మెకు వెళ్తూ మాకేమైనా చెప్పి వెళ్ళారా? మాతో మాట్లాడతారని చాలా సమయం వెయిట్ చేశామని అయినా ఆర్టీసీ నేతలు మమ్మల్ని సంప్రదించలేదన్నారు. ఇంతకీ మద్దతిస్తారా? లేదా అంటే మమ్మల్ని వాళ్ళు కోరితే అప్పుడు చూస్తామని జారుకున్నారు. అయితే టీఎన్జీఓ నేతలు మీడియా ముందుకు రాకముందే సీఎం కెసిఆర్ ఇంటికి వెళ్లి వచ్చారు. కెసిఆర్ తో భేటీ అనంతరం నేతలు ఆర్టీసీ సమ్మెపై ఇలా పరోక్షంగా ప్రభుత్వానికే జై కొట్టారు.

అయితే ఇంతకీ సీఎం భేటీలో ఏం జరిగింది. టీఎన్జీఓ నేతలు ఎందుకు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు అన్న దానికి రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. నిజానికి సీఎం కెసిఆర్ మాటలు చెప్పడంలో దిట్ట. ఆయన అనుకున్నది తెలంగాణ ప్రజలకు కన్విన్సింగ్ గా విడమర్చి చెప్పగలరు. అలానే టీఎన్జీఓలకు తనదైన స్టైల్లో తియ్యని మాటలు చెప్పారని కొందరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కార్మికులు, మీరు అధికారులు..  సమ్మెలకు దిగి మీ భవిష్యత్ మీరే నాశనం చేసుకుంటారా? నేనే చెప్తున్నా కదా మీరంతా నా బిడ్డలతో సమానం.. మీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తా..

నేను హామీ ఇచ్చాక కూడా మీరు సమ్మెలు, కొట్లాటకు దిగి ఆగమవుతారా? ఇప్పుడు మీరు ప్రభుతంలోకి రావటం మీ భవిష్యత్ పిఆర్సీలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ప్రభుత్వాలెప్పుడు బడ్జెట్ తోనే చూస్తాయి కనుక సంయమనం పాటించండి అంటూ తియ్యని మాటలతో సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు టీఎన్జీవోల్లో బలంగా వినిపిస్తోంది. ఇక మరో ముఖ్యకారణం టీఎన్జీఓ నేతలు కొందరి అవినీతి బాగోతం చిట్టా కెసిఆర్ వద్దకి చేరిందని.. దీంతో ప్రభుత్వానికి సరెండర్ కాక తప్పలేదని ఉద్యోగ సంఘాలలో వినిపిస్తుంది.

ఆ అవినీతి చిట్టా అంశం లోతుగా పరిశీలిస్తే.. గచ్చిబౌలిలో హోసింగ్ సొసైటీకి చెందిన కోట్ల విలువైన భూముల కేటాయింపులో టీఎన్జీఓ నేతలు కొందరు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కోట్ల విలువ చేసే ఖైరీదైన భూముని తమ వారికి కట్టబెట్టుకున్నారని.. ఇక ఇతర అక్రమ కట్టడాలకు లెక్కే లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ చిట్టా అంతా సీఎం తెప్పించుకున్న తర్వాతే టీఎన్జీఓ నేతలను తమ వద్దకు పిలిపించుకున్నారని ప్రగతి భవన్లో వినిపించింది. సీఎం తీయని మాటలు కానీ.. నేతల అవినీతి చిట్టా కానీ సమ్మెకి టీఎన్జీఓల మద్దతు లేకుండా చేయడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఒక్క టీఎన్జీఓలను ఆపితే సమ్మె ఆగుతుందా? కెసిఆర్ విభజించు పాలించు రూల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle