newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

టీఆర్ఎస్ సర్కార్ తీరుపై కాంగ్రెస్ ఫైర్

07-09-202007-09-2020 10:00:21 IST
Updated On 07-09-2020 08:09:18 ISTUpdated On 07-09-20202020-09-07T04:30:21.353Z07-09-2020 2020-09-07T02:20:01.291Z - 2020-09-07T02:39:18.813Z - 07-09-2020

టీఆర్ఎస్ సర్కార్ తీరుపై కాంగ్రెస్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు వన్‌సైడ్‌‌గా పని చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. డీసీసీ అధ్యక్షులు అంశాల వారీగా పోరాటాలు చేయాలి. ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలి.

గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్లంతా మనవైపు వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. నేను మీకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటాను, కొట్లాడుదాం.. గుర్తింపు తెచ్చుకుందాం. పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు ఉత్తమ్. 

మనం అధికారానికి దూరంగా వున్నాం. అయినా మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. రాబోయే ఎన్నికలలో మనమే గెలుస్తాం. డీసీసీ అధ్యక్షులు కష్టపడి పని చేస్తున్నారు.  అధికారంలో లేకున్నా పార్టీ పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషే కారణం అన్నారు ఉత్తమ్. గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో బలమయిన క్యాడర్ వుంది.

2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్ పాలనపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి ఆస్కారం ఇస్తోంది. ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దామన్నారు. 

ఇటు రాబోయే కార్పోరేషన్ల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేటర్‌లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై రూ.1,200 కోట్ల భారం ప్రజలపై పడిందని చెప్పారు. హైదరాబాద్‌లో అద్భుతాలు సృష్టించినట్టు కేటీఆర్‌ గొప్పలు చెబుతున్నారని, పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. 

అక్టోబర్‌ 3 నుంచి తన మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ‘డివిజన్‌ యాత్ర’చేపడుతున్నానని, టీఆర్‌ఎస్‌ విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని రేవంత్‌ చెప్పారు. ఖమ్మం మేయర్‌ పాపలాల్‌ అవినీతి పరుడని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారని పార్టీ నేత కుసుమకుమార్ ఆరోపించారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు అనేక హామీలిచ్చారని, కనీసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వని కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అసమర్థ టీఆర్ఎస్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle