newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఆర్ఎస్ యత్నాలకు కాంగ్రెస్ కెప్టెన్ చెక్

15-08-202015-08-2020 08:49:16 IST
Updated On 15-08-2020 10:22:35 ISTUpdated On 15-08-20202020-08-15T03:19:16.579Z15-08-2020 2020-08-15T03:18:50.100Z - 2020-08-15T04:52:35.867Z - 15-08-2020

 టీఆర్ఎస్ యత్నాలకు కాంగ్రెస్ కెప్టెన్ చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ఒక ప్రకటన చేసింది.దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగినప్పటికీ కాంగ్రెస్ పోటీలో ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు.

దుబ్బాకలో ఉప ఎన్నిక జరగకుండా చూస్తానని, ఉత్తమ్ తో మాట్లాడతానని ఇప్పటికే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం వేరేగా ఆలోచిస్తోంది. దీనిపై జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూద్దాం. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ పూర్తిగా మరిచి పోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అండగా పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని ఉత్తమ్ అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం మాత్రం దొంగ లెక్కలు చెబుతోందని ఉత్తమ్ మండిపడ్డారు.కరోనా కేసుల విషయంలో సర్కార్ ఇస్తున్న లెక్కలు తప్పని నిరూపిస్తామని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ కరోనా మరణాలపై మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీసీసీకి వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.

కరోనా మహమ్మారితో మృతి చెందిన పేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా కంట్రోల్ కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ మృతి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్, పోలీసులు, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఉత్తమ్ కుమార్  రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   18 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle