newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ రెబల్స్ బెడద!

09-01-202009-01-2020 14:59:58 IST
2020-01-09T09:29:58.401Z09-01-2020 2020-01-09T09:29:54.990Z - - 17-02-2020

టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ రెబల్స్ బెడద!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఇప్పుడు బలమైన పార్టీ ఏంటి అంటే ముందుగా ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేసిన గులాబీ రథసారధి తెరాస పార్టీని సంస్థాగతంగా నుండి బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలు, ఆధిపత్యపోరు వంటి స్వయంకృతాపరాధ చేష్టలతో నలిగిపోతుంది.

ఇక కాషాయం పార్టీ సీనియర్ నేతలను తనలో కలిపేసుకుంటూ ఇంకా బలపడే క్రమంలో ఉండగా.. టీడీపీ అయితే నలుగురు కార్యకర్తలలో తప్ప నేతలలో ఎక్కడా పార్టీ ప్రస్తావన కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను లెక్కలేసుకున్న గులాబీ బాస్ తన పార్టీని దృఢం చేసే క్రమంలో అన్ని పార్టీల నుండి వలసలను భారీగా ప్రోత్సహించారు.

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కావడంతో ప్రధమ శ్రేణి నుండి కార్యకర్తల వరకు అందరూ కారెక్కేశారు. అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ చేరికలు భారీగా మొదలవగా తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీలో ఎక్కడ చూసిన సీనియర్ నేతలతో కళకళలాడుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే టికెట్లపై భారీ పోటీ నెలకొనగా పార్టీ అధిష్టానం అసంతృప్తులను డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తించారు.

ఆ ఎన్నికలలో టికెట్ల లొల్లి జరుగుతుండగానే సిట్టింగ్ నేతలకి ప్రధమ పీఠ వేస్తూ కేసీఆర్ భారీగా అభ్యర్థులను ప్రకటించి రికార్డ్ సృష్టించారు. రెబల్స్ బెడద ఉంటుందని తెలిసినా కేసీఆర్ మొండి ధైర్యంతో ముందుకెళ్లి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఆ ధైర్యం కనిపించడం లేదని పార్టీవర్గాలలో వినిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ తేడాలు కనిపిస్తున్నాయని వారి అభిప్రాయం.

పార్టీకి భారీ చేరికలతో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో ఆచితూచి అడుగులేయాల్సి వస్తుంది. మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలలో రెబల్స్ ని సెంటర్ అఫ్ టార్గెట్ గా చేసే వీలుండదు. దీంతో రెబల్స్ వలన పార్టీలకు భారీ నష్టం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలలో రెబల్స్ ఉన్నా బలమైన గాలి వీస్తే తప్ప నష్టాలుండవు. స్థానిక ఎన్నికలలో పరిస్థితి వేరుగా ఉంటుంది.

అందుకే గులాబీ బాస్ రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం తన వ్యవహార శైలిని పక్కనపెట్టి ఒకటి నాలుగుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ బాధ్యులను చేస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కూడా ఓ కమిటీని నియమిస్తున్నారు. అంతగా పార్టీ చర్యలు తీసుకుంటున్నా ఇంకా పార్టీలో రెబల్స్ బెడద వినిపిస్తూనే ఉంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle