newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

20-02-202020-02-2020 11:33:04 IST
2020-02-20T06:03:04.238Z20-02-2020 2020-02-20T06:03:01.891Z - - 27-05-2020

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసుకున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పల్లెలు, బస్తీలు ఎంత అభివృద్ధి చెందాయో ప్రభుత్వం లెక్కలు చెప్తుంది కానీ అదంతా శాశ్వత ప్రగతా అన్నది ముందుముందు తేల్చుకోవాల్సిన అంశం. కానీ, ఈ కార్యక్రమం నేతలు, అధికారులను ప్రజలకు దగ్గర చేసిందన్నది మాత్రం ఒప్పుకోవాల్సిందే.

సరిగా రాష్ట్రంలో ఏదోఒక ఎన్నికలకు ముందుగా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని మరో దఫాను మొదలుపెట్టి మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నేతలు, అధికారులు అందరినీ ప్రజల బాట పట్టించడంతో నిత్యం ప్రజలతో మమేకమై ప్రభుత్వం తమ కోసం పాటు పడుతుందన్న భావన కలిగించేశారు. ఇది పంచాయతీ ఎన్నికల దగ్గర నుండి నిన్న మున్సిపల్ ఎన్నికల వరకు అలా అలా కొనసాగింది.

అయితే, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిశాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడో విడత పల్లె ప్రగతికి సిద్దమవుతుంది. బుధవారం మంత్రులు ఎక్కడిక్కడ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మూడో విడతకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో పట్టణ ప్రగతి కూడా మొదలుకానుంది. దీంతో అటు నేతలు, అధికారులు ప్రజలకు చేరువ కానున్నారు.

కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కౌంటరుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పట్టణ ప్రగతికి ధీటుగా రేవంత్ బస్తీ బాట పేరుతో ఏకంగా పాదయాత్రకి సిద్దమైనట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అధికారికంగా ఇది ఖరారు కాకపోయినా దాదాపుగా జరిగే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తుంది.

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు దగ్గర నుండి నిరుద్యోగం, బస్తీలలో సమస్యలు, నిధులు, తాగునీటి సమస్య, కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో పరిస్థితులు వంటి సమస్యలను ఎత్తిచూపడం, పరిష్కారమే ఎజెండాగా రేవంత్ కార్యాచరణ ఉండబోతుందని తెలుస్తుంది. ముందుగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది మొదలు పెట్టనున్నారట.

ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం హుషారులో లేదు. వరస ఓటములతో క్యాడర్ లో నిరాశతో పాటు నేతలు అసలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో చతికిలా పడింది. ఈక్రమంలో రేవంత్ కాస్త జోష్ పెంచేందుకు కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే కుమ్ములాటలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలకు సీనియర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండనిస్తారా? అధిష్టానం అనుమతులు ఇస్తుందా? అన్నదే ఇక్కడ ప్రశ్న!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle