newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

టీఆర్ఎస్ టు కాంగ్రెస్‌..! మారుతోన్న కండువాలు..!

11-01-202011-01-2020 08:01:05 IST
2020-01-11T02:31:05.648Z11-01-2020 2020-01-11T02:30:55.629Z - - 22-09-2020

టీఆర్ఎస్ టు కాంగ్రెస్‌..! మారుతోన్న కండువాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుకున్న‌దే జ‌రుగుతోంది. మున్సిప‌ల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి రెబెల్స్ బెడ‌ద తీవ్ర‌మైంది. టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండ‌టంతో నేత‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

టిక్కెట్ ద‌క్క‌ని నేత‌లు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీకి సిద్ధ‌పడుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీకి దిగుతున్నారు. రెబెల్స్‌ను బుజ్జ‌గించ‌డంలో చాలా చోట్ల టీఆర్ఎస్ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

గ‌త ప‌దేళ్లుగా తెలంగాణ‌లో ఏ పార్టీలో జ‌ర‌గ‌న‌న్ని చేరిక‌లు టీఆర్ఎస్ పార్టీలో జ‌రిగాయి. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేత‌లు, క్యాడ‌ర్ టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఉద్య‌మం స‌మ‌యంలో కొంద‌రు, టీఆర్ఎస్ మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రు, రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రికొంద‌రు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కారు పార్టీ ఓవ‌ర్‌లోడ్ అయ్యింది.

పార్టీలో ముందునుంచీ ఉన్న వారు, త‌ర్వాత చేరిన వారు అంతా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. మున్స‌పోల్స్‌లో పోటీ చేసి ప్ర‌జాప్ర‌తిన‌ధిగా ఎన్నిక కావాల‌ని క‌ల‌లు క‌న్నారు. టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండ‌టంతో పార్టీ ముందుగానే అప్ర‌మ‌త్త‌మైంది. ఎట్టి ప‌రిస్థితుల్లో రెబెల్స్ లేకుండా చూసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు ఆదేశాలు ఇచ్చారు. టిక్కెట్ల కేటాయింపు అధికారం కూడా వారికే అప్ప‌గించారు.

రెబెల్స్‌ను బుజ్జ‌గించ‌డం వారికి త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. టిక్కెట్ ద‌క్కిన వారే కాక‌కుండా టిక్కెట్ ఆశించి భంగ‌పడ్డ వారు కూడా పెద్ద ఎత్తున నామినేష‌న్లు వేశారు. కొంద‌రు త‌మ‌కు టిక్కెట్ ఇవ్వ‌లేద‌ని ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

మ‌రికొంద‌రైతే ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌కు పాల్ప‌డ్డారు. ఇంకొంద‌రు త‌మ‌ను టిక్కెట్ కోసం డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ఈ ప‌రిస్థితి ఉంది.

టిక్కెట్లు ద‌క్క‌ని చాలా మంది టీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాస్త‌వానికి, వ‌రుస ఓట‌ములు, వ‌ల‌స‌ల ప్ర‌భావంతో చాలా వార్డులు, డివిజ‌న్ల‌లో కాంగ్రెస్‌కు స‌రైన అభ్య‌ర్థులు కూడా లేరు. దీంతో టీఆర్ఎస్ టిక్కెట్ ద‌క్క‌ని నేత‌లు ఈ రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ బీఫాం ద‌క్కించుకుని పోటీ చేస్తున్నారు. వీరిలో కొంద‌రిని టీఆర్ఎస్ మ‌ళ్లీ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

తాజాగా ఫీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో జ‌రిగిన త‌తంగ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. టీఆర్ఎస్ నుంచి మేయ‌ర్ అభ్య‌ర్తిత్వం ఆశించిన ద‌యాక‌ర్ రెడ్డి అనే నేత‌కు పార్టీ నుంచి హామీ రాక‌పోవ‌డంతో నామినేష‌న్ల‌కు చివ‌రి రోజైన శుక్ర‌వారం ఎంపీ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టిక్కెట్‌తో పాటు మేయ‌ర్ అభ్య‌ర్తిత్వంపై హామీ పొందారు. ఆయ‌న కాంగ్రెస్‌లో చేరాక కొంత‌సేప‌టికి మ‌ళ్లీ మంత్రి మ‌ల్లారెడ్డి ఆయ‌న ఇంటికి వెళ్లి టీఆర్ఎస్‌లోనే ఉండాల‌ని బుజ్జ‌గించారు.

చాలా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో టీఆర్ఎస్ ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంటోంది. దీంతో రెబెల్స్‌ను బుజ్జ‌గించ‌డంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులకు స‌మ‌యం స‌రిపోతోంది. దీంతో ప్ర‌చారంలో ముందుండాల్సిన అధికార పార్టీ వెనుక‌బ‌డి పోతోంది. అయితే, టీఆర్ఎస్‌కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నందునే టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంద‌ని, రెబెల్స్ స‌మ‌స్య ఉండ‌ద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle