newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

టీఆర్ఎస్ ఖబర్దార్.. గులాబీతో మజ్లీస్ పొలిటికల్ డ్రామా!

21-01-202021-01-2020 11:51:32 IST
2020-01-21T06:21:32.771Z21-01-2020 2020-01-21T06:21:27.645Z - - 22-02-2020

టీఆర్ఎస్ ఖబర్దార్.. గులాబీతో మజ్లీస్ పొలిటికల్ డ్రామా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ పార్టీలు... నేతల ఆటలు.. ఓట్ల కోసం వాళ్ళు వేసే ఎత్తులు.. ప్రజలపై వాళ్ళు చూపించే ప్రేమలు.. సమాజం పట్ల వాళ్ళకి ఉండే గౌరవం అన్ని కలిసి వాళ్లలో నటనా కౌసల్యం బయటకు వస్తుంది. మన నేతలు.. ప్రజలను ఆకట్టుకునేందుకు గొంగళి పురుగైనా ముద్దు పెట్టుకుంటారన్న సామెత ఈ సమయంలో నిజమే అనిపిస్తుంది. అలానే ప్రజలకు నచ్చరనుకుంటే సొంత బిడ్డనైనా దూరం పెట్టేస్తారేమో అనిపిస్తుంది.

ప్రస్తుతం తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమైన సంగతి తెలిసిందే. మరి కొద్ది గంటలలోనే ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే పార్టీలు ప్రచారం ముగించి ప్రస్తుతం తెరవెనుక తాయిలాల వ్యవహారంలో బిజీబిజీగా ఉన్నారు. అయితే ప్రచారం చివరి రెండు రోజులలో అధికార టీఆర్ఎస్ పార్టీకి.. ప్రతిపక్షంలో మిత్రపక్షం.. మిత్రపక్షంలో ప్రతిపక్షం ఎంఐఎం నేతల మధ్య మాటలు ఆసక్తిగా కనిపించాయి.

టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీల మధ్య బంధం ఏంటి అని ఆ రెండు పార్టీల నేతలను అడిగితే తామెప్పుడూ మిత్రులమే అంటూ ప్రేమ కురిపిస్తారు. ఇక ఎన్నికల సంగతి ఏంటి అంటే.. మాది ఫ్రెండ్లీ పోటీ మాత్రమేనని.. పొత్తులు ఉండవు.. పోరాటాలు ఉండవు.. జస్ట్ ఒకరికి ఒకరి మధ్య అనుబంధమే అంటారు. ఇక ఈ రెండు పార్టీల మధ్య బహిరంగంగా సంబంధాలేమో కానీ అవసరమైతే ఒవైసీ సీఎం ఇంటికి వెళ్లి రహస్యంగా గంటల పాటు సమావేశాలయ్యేంత సీక్రెట్ అనుబంధాలైతే ఉన్నాయి.

అయితే, ఎంఐఎం పార్టీతో మితృత్వం తనకి శత్రువు అవుతుందని అనుకున్నారేమో కానీ టీఆర్ఎస్ నేతలు చివరి రెండు రోజులలో ఎంఐఎంతో మాకేంటి సంబంధం అనేశారు. అంతేకాదు ఎంఐఎంను మిగతా అన్ని పార్టీలు అంటున్నట్లుగానే మతతత్వ పార్టీ అనేసింది. చివరికి టీఆర్ఎస్ నేతలు కొందరు ఎంఐఎంకి ఓటేస్తే మీకు మీరే ఘోరీ తీసుకున్నట్లేనని ఘాటు విమర్శలకు దిగారు.

ఇక ఒక మంత్రి అయితే అందరూ అనుకున్నట్లుగా నిజామాబాద్ మేయర్ పదవి ఎంఐఎంకి ఇస్తే ముక్కు నేలకి రాస్తానని చెప్పారు. ఇక మరో మంత్రి అయితే ఎంఐఎం ఓ పాతబస్తీ పార్టీ అని.. దాంతో మాకేంటి అసలు సంబంధం అంటూ తీసిపారేశారు. ఇన్నేసి మాటలు అన్నాక ఎంఐఎం మాత్రం ఊరికే ఉంటుందా? ఆ పార్టీ పెద్దాయన అసదుద్దీన్, అయన బ్రదర్ అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు.

టీఆర్‌ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే తమ నోటికి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్.. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండని సూచించారు. సొంత కొడుకును గెలిపించుకోలేని వాళ్ళు.. సొంత పార్టీలో కూడా చెల్లని వాళ్ళు కూడా మాపై విమర్శలా? మాట్లాడే ముందు మీరేంటో గుర్తుకు తెచ్చుకోండని బ్రదర్స్ రెచ్చిపోయారు. మిగతా ప్రతిపక్షాలు పాడే టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ పాటకి విరుగుడు కోసమే ఇన్ని నాటకాలు కాబోలు!

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle