టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేషనల్ పార్టీల లోకల్ కౌంటర్..!
27-01-202027-01-2020 07:47:52 IST
Updated On 27-01-2020 12:33:20 ISTUpdated On 27-01-20202020-01-27T02:17:52.929Z27-01-2020 2020-01-27T02:11:57.001Z - 2020-01-27T07:03:20.293Z - 27-01-2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు కొత్త టార్గెట్ పెట్టుకుంది. మొత్తానికి మొత్తం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దక్కించుకొని కొత్త చరిత్ర లిఖించాలని భావిస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 32 జెడ్పీలను గెలుచుకుంది. ఇప్పుడు కూడా అన్ని మున్సిపాలిటీల్లో పాగా వేసేలా పావులు కదుపుతోంది. ఇందుకోసం టీఆర్ఎస్కు అవకాశంగా ఉన్న ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకుంటోంది. శనివారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 80కిపై మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా గెలిచింది టీఆర్ఎస్. కాంగ్రెస్ కేవలం ఆరు మున్సిపాలిటీలను, బీజేపీ 2 మున్సిపాలిటీలు, ఎంఐఎం రెండు మున్సిపాలిటీలు గెలుచుకున్నాయి. సుమారు 25 మున్సిపాలిటీల్లో హింగ్ ఏర్పడింది. అయితే, హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలతో పాటు కాంగ్రెస్, బీజేపీకి వెళ్లాయని భావిస్తున్న 8 మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్‌గిరి దక్కించుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకున్న భైంసా, జల్పల్లి మినహా మిగతా 118 మున్సిపాలిటీలనూ కైవసం చేసుకునేలా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఎక్స్ అఫీషియో ఓట్లను సమర్థంగా ఉపయోగించుకొని కాంగ్రెస్, బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కకుండా పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టీఆర్ఎస్కే ఉన్నారు. వీరంతా వారివారి నియోజకవర్గాల పరిధిలో ఏ మున్సిపాలిటీలో అయినా ఎక్స్ఆఫీషియో సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్కు బలంగా మారింది. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో ఈ ఓట్లు వాడుకొని ఛైర్మన్‌గిరి దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్న మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్రులు, ఎంఐఎం సభ్యుల మద్దతు టీఆర్ఎస్ కూడగడుతోంది. ఎక్స్ అఫీషియో ఓట్లు ఈ మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా ఉపయోగించుకుంటే అన్ని మున్సిపాలిటీలను దక్కించుకునేలా టీఆర్ఎస్ ప్లాన్లు వేస్తోంది. ఈ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉంచింది టీఆర్ఎస్. ఇకవైపు ప్రత్యర్థులను పూర్తిస్థాయిలో దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతుండగా దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తమ ఖాతాలో పడ్డాయనుకుంటున్న మున్సిపాలిటీలతో పాటు హింగ్ ఏర్పడ్డ వాటిల్లోనూ మెజారిటీ మున్సిపాలిటీలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ సభ్యులను క్యాంపులకు తరలించిన ఈ రెండు పార్టీలు కొన్ని చోట్ల స్థానికంగా అవగాహనకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో హింగ్ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కలిస్తే ఛైర్మన్‌గిరి దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా స్థానికంగా ఈ రెండు పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లను ఉపయోగించుకొని తమకు ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కొద్దని చూస్తున్న టీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చేందుకు చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో స్కూల్స్ బంద్
14 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
14 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
18 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
15 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
a day ago

ఈ టైంలో అవసరమా మేడమ్
a day ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా