newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

టీఆర్ఎస్‌లో రోడ్డు రోల‌ర్ టెన్ష‌న్‌..!

23-10-201923-10-2019 09:42:50 IST
Updated On 23-10-2019 14:49:07 ISTUpdated On 23-10-20192019-10-23T04:12:50.164Z23-10-2019 2019-10-23T04:12:41.773Z - 2019-10-23T09:19:07.393Z - 23-10-2019

టీఆర్ఎస్‌లో రోడ్డు రోల‌ర్ టెన్ష‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ అధికార టీఆర్ఎస్ నేతల‌ను మాత్రం ఓ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు రోడ్డు రోల‌ర్ పేరు వింటేనే ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నెల 24న ఫ‌లితం రాబోతున్నా.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్‌దే విజ‌య‌మ‌ని చెబుతున్నా.. ఒక్క రోడ్డు రోల‌ర్‌ అంశం మాత్రం టీఆర్ఎస్‌ను ఇప్పుడు క‌ల‌వ‌రపెడుతోంది.

హుజూర్‌న‌గ‌ర్‌లో దాదాపు 10 వేల‌కుపైగా మెజార్టీతోనే గెలుస్తామ‌ని గులాబీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, రోడ్డు రోల‌ర్ గుర్తు ఏం చేస్తుందో అన్న టెన్ష‌న్ ఇప్పుడు టీఆర్ఎస్ నేత‌ల్లో క‌న‌ప‌డుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తు గులాబీకి 30 నుంచి 35 సీట్ల‌లో ప్ర‌భావం చూపింది. త‌క్కువ మార్జిన్‌తో గెల‌వాల్సిన సీట్ల‌ను కోల్పోయింది.

2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రోడ్డు రోల‌ర్ సింబ‌ల్ ఎఫెక్ట్ బాగానే ప‌డింది. భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రోడ్ రోల‌ర్ దెబ్బ‌కు టీఆర్ఎస్ అభ్యర్ధి బూర న‌ర్స‌య్య గౌడ్ ఓడిపోయారు. అక్క‌డ రోడ్ రోల‌ర్‌కు 27,973 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఓట్ల తేడాతోనే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి విజ‌యం సాధించారు.

ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ ఈవీఎంల‌లో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధుల‌కు మొద‌టి నాలుగు ప్లేస్‌లు కేటాయించారు. కారు గుర్తు వెంట‌నే రైతు న‌డిపే ట్రాక్ట‌ర్ గుర్తు, ఆ త‌రువాత రోడ్ రోల‌ర్ గుర్తు ఉన్నాయి. మూడు గుర్తులు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. దీంతో వృద్ధులు, మ‌హిళ‌లు కొంత సైట్ ఉన్న‌వారు కారు అనుకుని పొర‌పాటున రోడ్డు రోల‌ర్‌కు వేసే అవ‌కాశం ఉంది.

పోల్ పోస్టుమార్టంలో కూడా కొంద‌రు అటేవేశార‌ని తేల‌డంతో గులాబీ నేత‌లు టెన్ష‌న్‌లో పడ్డారు. రోడ్డు రోల‌ర్ ఎంత మేర డ్యామేజీ చేసింద‌నే లెక్క‌లు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. రిప‌బ్లిక్ సేన పార్టీకి చెందిన కిర‌ణ్ మంగ‌ప‌ల్లికి రోడ్డు రోల‌ర్ గుర్తు వచ్చింది. ఈయ‌న‌కు ఎన్ని ఓట్లు ప‌డ‌తాయోన‌ని అటు టీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్ నేతలు పొలిటిక‌ల్ లెక్క‌లేస్తున్నారు. మ‌రోవైపు రైతు బిడ్డ పార్టీ అజ్మీరా మ‌హేష్‌కు ట్రాక్ట‌ర్ న‌డిపే రైతు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ లింగిడి వెంక‌టేష్‌కు హెలికాప్ట‌ర్ గుర్తు వ‌చ్చాయి. ఈ గుర్తుల‌కు ఎన్ని ఓట్లు ప‌డ్డాయ‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. 

 

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle