newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

18-10-201918-10-2019 16:54:31 IST
2019-10-18T11:24:31.189Z18-10-2019 2019-10-18T11:24:26.132Z - - 14-11-2019

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మెకు అధికార తెరాస ఎమ్మెల్యేలు పరోక్ష మద్దతు పలికారు. దాదాపు 30 మంది పైగా తెరాస ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల ఆందోళనల్లో ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొనట్లేదు. పరోక్షంగా మాత్రమే మద్దతునిస్తూ తమ అనుచరులను ఆందోళనల్లో పాలు పంచుకునేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అధికార తెరాస ఎమ్మెల్యేల ఎత్తుగడలపై చర్చ సాగుతోంది.  ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక తెరాస కీలక నేతలే ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన నేతలెవ్వరూ బాహాటంగా ఖండించటం లేదు. అలాగని మద్దతుగా ప్రకటనలు చేయడం లేదు. ఈ విషయమై తెలంగాణ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కరీనంగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తెరాస యూటీ బ్యాచ్ నేతలు అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  అక్టోబర్ 19న జరిగే రాష్ట్ర బంద్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించనున్నట్లు పరోక్ష సంకేతాలు జేఏసీ నేతలకు అందినట్లు సమాచారం. 

పార్టీ అగ్రనేత, తెరాస పార్లమెంటరీ నేత కే. కేశవరావు మూడు రోజుల క్రితం ఆర్టీసీ సమ్మెపై మానవతా దృక్పథంతో స్పందించారు. కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని అటు జేఏసీ నేతలకు, కార్మికులతో చర్చలు జరపాలని ఇటు ప్రభుత్వ పెద్దలకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. జేఏసీ నేతలు స్వాగతించారు.  కేకే మధ్యవర్తిత్వం వహిస్తే తాము చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వ పెద్దలనుంచి చర్చలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కేకే మిన్నకుండి పోయారు. రాష్ట్ర రాజకీయాల్లో కేకే చొరవ పలువిధాలుగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో తెరాస నేతలు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా నిలుస్తున్నారని తాజా సమాచారం.

ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో పలువురు ఆశావహులు అసమ్మతి రాగం వినిపించారు. బాహాటంగానే తమ అక్కసును వెళ్లగక్కారు. పార్టీ పెద్దలపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో స్థానికంగా నియోజకవర్గంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపధ్యంలో ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగానే తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు. 

ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ మనుగడ పైనే సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేనప్పటికీ అసమ్మతి పెరిగిపోయిందనే వాదన అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

 

 

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle