newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

టీఆర్ఎస్‌లో గుబులు పుట్టిస్తున్న ఇంటిపోరు

04-01-202004-01-2020 14:52:54 IST
Updated On 04-01-2020 16:28:17 ISTUpdated On 04-01-20202020-01-04T09:22:54.339Z04-01-2020 2020-01-04T09:22:52.315Z - 2020-01-04T10:58:17.622Z - 04-01-2020

టీఆర్ఎస్‌లో గుబులు పుట్టిస్తున్న ఇంటిపోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ముఖ్య‌నేత‌ల మ‌ధ్యే స‌ఖ్య‌త లేక‌పోవ‌డం ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. హైద‌రాబాద్ శివారులోని మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కీల‌కం కానుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే ఏకంగా మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంత‌టి కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది.

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో మ‌లిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. చామ‌కూర మ‌ల్లారెడ్డి ఎంపీగా ఉండేవారు. 2018 ఎన్నిక‌ల నాటికి మంత్రి ప‌ద‌విపై క‌న్నేసిన మ‌ల్లారెడ్డి మేడ్చ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

త‌న టిక్కెట్‌కు మ‌ల్లారెడ్డి ఎర్త్ పెట్ట‌డంతో అప్ప‌టి నుంచే మ‌ల్లారెడ్డి వ‌ర్సెస్ సుధీర్ రెడ్డిగా మారిపోయింది. చివ‌ర‌కు టిక్కెట్ మ‌ల్లారెడ్డికే ద‌క్క‌డంతో సుధీర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు. పార్టీ పెద్ద‌లు ఆయ‌న కుమారుడి రాజకీయ భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వ‌డంతో ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేశారు.

ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ల్లారెడ్డి మంత్రి అయ్యారు. అప్ప‌టివ‌ర‌కు సుధీర్ రెడ్డి వ‌ర్గంగా ఉన్న నేత‌లు కూడా మ‌ల్లారెడ్డి వెంట న‌డుస్తున్నారు. దీంతో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది.

ఎక్కువ‌గా ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఉన్న నేత‌లు సుధీర్ రెడ్డి వైపు ఉండ‌గా, త‌ర్వాత వ‌చ్చిన నేత‌లు మ‌ల్లారెడ్డి వ‌ర్గంగా ఉన్నారు. సుధీర్ రెడ్డి కుమారుడు శ‌ర‌త్ చంద్రారెడ్డికి జెడ్పీ ఛైర్మ‌న్‌గా పార్టీ అవ‌కాశం ఇవ్వ‌డంతో సుధీర్ రెడ్డి వర్గం కూడా మ‌రింత బల‌ప‌డింది.

ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రెండు వ‌ర్గాల నేత‌లు టిక్కెట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో రెండు వ‌ర్గాలకు చెందిన నేత‌లు త‌మ‌కంటే త‌మ‌కే టిక్కెట్లు ఇవ్వాలంటే సుధీర్ రెడ్డి, మ‌ల్లారెడ్డి చుట్టూ తిరుగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరిగాయి. ఏకంగా హ‌రీష్ ముందే, బ‌హిరంగ స‌భ వేదిక‌పైనే ఒక‌రికొక‌రు హెచ్చ‌రించుకునే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి.జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ ఎన్నిక‌ల స‌న్నాహ‌న స‌భ‌కు మంత్రి హ‌రీష్‌రావు హాజ‌రై మాట్లాడుతుండ‌గానే ఆయ‌న వెన‌కాలే కూర్చున్న మ‌ల్లారెడ్డి, సుధీర్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఇద్ద‌రూ ఒక‌రి వైపు ఒక‌రు వేలు చేయించుకుంటూ గొడ‌వ ప‌డ్డారు. ముందు నుంచీ పార్టీలో పని చేస్తున్న‌వారికి, ఉద్య‌మంలో ప‌ని చేసిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ హ‌రీష్ రావు ముందే సుధీర్ రెడ్డి గ‌ట్టిగా చెప్పారు. మ‌ల్లారెడ్డి వ‌ర్గానికి మాత్ర‌మే టిక్కెట్ ఇస్తామంటే కుద‌ర‌ద‌నే రకంగా ఆయ‌న మాట్లాడారు.

ఇదే ప‌రిస్థితి ఇంకా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఇటీవ‌ల ఇత‌ర పార్టీల నుంచి ఫిరాయించి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు త‌మ వ‌ర్గానికి చెందిన వారికి, త‌మతో పాటు టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన వారికే టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిని ముందు నుంచీ టీఆర్ఎస్‌లో ఉన్న నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రి, ఈ విభేదాల‌ను పార్టీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle