newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

టీఆర్ఎస్‌లో ఇద్ద‌రు నేత‌ల‌కు ఉప ఎన్నిక టెన్ష‌న్‌..!

21-10-201921-10-2019 09:39:59 IST
Updated On 21-10-2019 17:21:31 ISTUpdated On 21-10-20192019-10-21T04:09:59.051Z21-10-2019 2019-10-21T04:09:56.900Z - 2019-10-21T11:51:31.880Z - 21-10-2019

టీఆర్ఎస్‌లో ఇద్ద‌రు నేత‌ల‌కు ఉప ఎన్నిక టెన్ష‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ ఉత్కంఠ‌గా మారింది. అయితే, శ‌నివారంతో ఎన్నిక ప్ర‌చారం ముగించుకున్న రాజ‌కీయ పార్టీలు నేడు పోలింగ్‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ మాదిరి ఫైట్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక గులాబీద‌ళంలోని ఓ ఇద్ద‌రు నేత‌ల‌ను మాత్రం తెగ టెన్ష‌న్ పెడుతోంది. ఒక‌రు ఎన్నిక‌ల ఇన్‌చార్జి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కాగా, మ‌రొక‌రు జిల్లా మంత్రి జ‌గదీశ్వ‌ర్‌రెడ్డి.

హుజూర్‌న‌ర్ ఉప ఎన్నిక గెలిస్తే వీళ్ల ప‌ద‌వుల‌కు ఎటువంటి డోకా ఉండ‌ద‌ని, కానీ తేడా వ‌స్తే మాత్రం ఒక‌రికి ప్ర‌మోష‌న్ మిస్‌.. ఇంకొక‌రికి డిమోష‌న్ ప‌క్కా అన్న భ‌యం వారిని ప‌ట్టుకుందంటూ టీఆర్ఎస్ వ‌ర్గాలు బాహాటంగానే చెబుతున్నారు. కాగా, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి నామినేటెడ్ ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక పూర్త‌వ‌గానే ప‌ల్లాకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ఇలా ఈ ఉప ఎన్నిక ప‌ల్లాకు చాలా ముఖ్యంగా మారింది. దీంతో ఎలా అయినా స‌రే ఉప ఎన్నిక‌ను గెలిచితీరాల‌న్న క‌సితో ఆయ‌న ఇప్ప‌టి వర‌కు పనిచేస్తూ వ‌చ్చారు.

ఇక మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డికి కూడా ఈ ఎన్నిక అత్యంత కీల‌కం. హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ ఎప్పుడూ గెల‌వ‌లేదు. స్వ‌యాన జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కూడా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నిక గెల‌వాలి. తేడా వ‌స్తే ఆయ‌న‌ మంత్రి ప‌ద‌వికి గండ‌మ‌ని కూడా తెలుస్తుంది. దీంత ఆయ‌న అంతా తానై ఉప ఎన్నిక ప్ర‌చారాన్ని త‌న భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు. సైదురెడ్డి త‌రుపున గ్రామ గ్రామాన తిరిగి ప్ర‌చారం కూడా చేశారు.

ఇక‌, ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించి టీఆర్ఎస్ త‌రుపున అధినేత‌ల ప్ర‌చార‌మూ లేదు.. బ‌హిరంగ స‌భ‌లూ లేవు. అయినా ఎన్నిక గెల‌వాలి. దీంతో ఇద్ద‌రికీ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి శ‌నివారంతో తెర ప‌డిన‌ప్ప‌టికీ కేటీఆర్ ఒక్క‌రోజు రోడ్ షో, సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ రద్దు వంటి ప‌రిణామాల‌తో టీఆర్ఎస్ గెలుపు భారం మొత్తం ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డిల‌పైనే ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

మ‌రోవైపు కాంగ్రెస్ నుంచి నేత‌లంతా హుజూర్‌న‌గ‌ర్‌లో మోహ‌రించి ప్ర‌చారం చేశారు. కానీ, టీఆర్ఎస్ త‌రుపున మాత్రం కేవ‌లం న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ నేతలు మాత్ర‌మే రంగంలోకి దిగారు. దీంతో

మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిల‌పైనే ప్ర‌చార భారాన్ని, కార్య‌క‌ర్త‌లను స‌మ‌న్వ‌యం చేసుకునే బాధ్య‌త‌ల‌ను అధిష్టానం ఉంచింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక గెలిచినా.. తేడా వ‌చ్చినా వారిద్ద‌రితే కీ రోల్. క‌నుక ఇద్ద‌రు నేత‌ల‌కు టెన్ష‌న్ ఓ రేంజ్‌లో ప‌ట్టుకుందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు వారి మాట‌ల్లో పేర్కొంటున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle