newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఆర్ఎస్‌ను టెన్ష‌న్ పెడుతున్న ప‌ట్ట‌భ‌ద్రులు..

16-09-202016-09-2020 10:18:36 IST
2020-09-16T04:48:36.384Z16-09-2020 2020-09-16T04:48:32.418Z - - 19-04-2021

టీఆర్ఎస్‌ను టెన్ష‌న్ పెడుతున్న ప‌ట్ట‌భ‌ద్రులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రావిర్భావం నుంచి తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. ఎన్నిక‌ల ఏదైనా విజ‌యం మాత్రం ఆ పార్టీనే వ‌రిస్తోంది. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నిక‌లు, పార్ల‌మెంటు, మున్సిప‌ల్‌, స్థానిక సంస్థ‌లు, ఎమ్మెల్సీ, ఇలా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా టీఆర్ఎస్ జెండానే ఎగురుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు టెన్ష‌న్ మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌నే ఆందోళ‌న ఆ పార్టీలో మొద‌లైంది. గ‌తంలో వ‌చ్చిన ప్ర‌తికూల ఫ‌లితాలే ఇందుకు కార‌ణం.

2014 అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి మొద‌టి షాక్ ఇచ్చింది ప‌ట్ట‌భ‌ద్రులే. 2016లో హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్య‌ర్థి రాంచంద్రారావు చేతిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి దేవిప్ర‌సాద్ ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ గెలుపుతో ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్‌కు 2019లో జ‌రిగిన క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్ ప‌ట్ట‌భ‌ద్రులు షాకిచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నేరుగా బ‌రిలోకి దిగ‌క‌పోయినా ఓ అభ్య‌ర్థికి అన‌ధికారికంగా మ‌ద్ద‌తు ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జీవ‌న్ రెడ్డి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఇప్పుడు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానానికి మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఈ ఎన్నిక‌లు ఉంటాయి. ఈ రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గ‌ట్టి పోటీ ఎదుర్కోబోతోంది. వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ ఖ‌మ్మం స్థానంలో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఉన్నారు. ఈ స్థానంపై తెలంగాణ జ‌న స‌మితి అధ్యక్షుడు ప్రొ.కోదండ‌రాం క‌న్నేశారు. ఆయ‌న ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మూడు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్లాన్ చేసుకున్నారు.

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం కూడా త‌న‌కే మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని కోదండ‌రాం భావిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ‌నేత‌గా, విద్యావంతుడిగా, ప్రొఫెస‌ర్‌గా కోదండ‌రాంకి గుర్తింపు ఉంది. ఫ‌ట్ట‌భ‌ద్రుల్లో ఆయ‌న ప‌ట్ల సానుకూలత మ‌రింత ఎక్కువ‌గా ఉంది. దీంతో కోదండ‌రాం గ‌నుక బ‌రిలో నిలిస్తే ఆయ‌న‌కు విజ‌యావ‌కాశాలు మెర‌గ‌వుతాయి. పైగా న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండ‌టం కూడా ఆయ‌న‌కు క‌లిసిరావ‌చ్చు. అయితే, కోదండ‌రాం అంటేనే టీఆర్ఎస్‌కు గిట్ట‌దు. ఆయ‌న ఎమ్మెల్సీగా గెలిచి శాస‌న‌మండ‌లిలో అడుగుపెడితే కంట్లో న‌లుసుగా మారుతారు. దీంతో ఆయ‌న‌ను ఓడించ‌డానికి టీఆర్ఎస్ పార్టీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది.

ఇక‌, హైద‌రాబాద్, రంగారెడ్డి, న‌ల్గొండ స్థానంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్‌కు స‌వాల్ ఎదుర‌వుతోంది. గ‌త‌సారి టీఆర్ఎస్‌ను ఇక్క‌డ బీజేపీ ఓడించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మ‌రోసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. తెలంగాణలో అధికార పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు గెలిచి టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మూడు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకుంటే ఆ పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. పైగా హైదరాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ కొంత బ‌లంగా ఉంది.

ఈ రెండు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందిక‌రంగా మారాయి. ప్ర‌త్యేకించి ప‌ట్ట‌భ‌ద్రులు, నిరుద్యోగుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త ఉంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్ట‌డం లేద‌నే అసంతృప్తి ఉంది. పైగా చ‌ట్ట‌స‌భ‌లో ప్రతిప‌క్షం, ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించే ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఉండాల‌ని ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో ఒక స్థానంలో కోదండ‌రాం నుంచి, మ‌రోస్థానంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి పోటీ ఉండ‌నుంది. అయితే, ఈ రెండు స్థానాల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచే యువ‌త‌కు ట‌చ్‌లో ఉండాల‌ని కేటీఆర్ టీఆర్ఎస్ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   20 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle