newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టమోటా రైతుల ఘోష పట్టించుకోరా?

17-03-202017-03-2020 09:16:29 IST
2020-03-17T03:46:29.946Z17-03-2020 2020-03-17T03:46:20.520Z - - 16-04-2021

టమోటా రైతుల ఘోష పట్టించుకోరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. నిత్యం పంటచేలలో చెమటను చిందిస్తున్న రైతులు చివరాఖరికి గిట్టుబాటు ధర వచ్చేసరికి నిలువునా దగా పడుతున్నాడు. నిత్యం టమాటా రైతులు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. మార్కెట్‌లో ధర అమాంతం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు పండించిన టమాటా అధికంగా హైదరాబాద్‌లోని పలు మార్కెట్‌లకు తరలిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్‌ మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున టమాట వస్తుండటంతో స్థానికంగా దొరికే టమాటా ధర పూర్తిగా పడిపోయింది. డిసెంబర్, జనవరిలో కొంత ధర పలికినా ఫిబ్రవరి నుంచి పూర్తిగా ధరలు బాగా తగ్గిపోయాయి. రెండు నెలల క్రితం కిలో టమాట రూ.20 పలకగా ఇప్పుడు రూ.పదికి మూడు కిలోలు విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 

దీంతో టమాట రైతు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్‌ మార్కెట్‌లో తగినంత ధరలు రాకపోవడంతో చాలామంది స్థానికంగా వికారాబాద్, తాండూరు మార్కెట్‌కు టమాటా తీసుకొస్తున్నారు. అక్కడ కొనుగోలుదారులు ఎక్కువగా లేకపోవడంతో టమాటాకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. సాధారణంగా 25 కిలోల టమోటా బాక్స్ గతంలో 250 రూపాయల వరకూ పలికేది. అంటే కిలో హోల్ సేల్ గా 10 రూపాయలన్నమాట. అది రిటైల్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి 15 రూపాయలు అయ్యేది. కానీ ఇప్పుడు ఒక్కో టమాట బాక్స్‌ ధర రూ.30 నుంచి రూ.50కి ధర పలుకుతోంది. అంటే కిలో రెండురూపాయలు అన్నమాట. 

ప్రతిఏటా ఉన్నట్లుగానే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మంచి ధర పలుకుతుందని రైతులు టమాటా పంట సాగుచేశారు. అత్యధికమంది రైతులు ఒకేసారి పంటను సాగుచేయడంతో ఒకేసారి పంట చేతికి వచ్చింది. దీంతో మార్కెట్‌కు రోజు వందల కొద్ది బాక్సుల టమాటా వస్తోంది. ఈ కారణంగా ధర పూర్తిగా నేలను తాకింది. ఇటు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. మూడు నెలల క్రితం కిలో రూ. 50 నుండి రూ.80 వరకు పలికిన టమాటా ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతోంది.

గత కొన్ని రోజులుగా కిలో టమాట రూ.3 కే ఇస్తున్నారు. టమాట సాగుకు ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు ఖర్చు వస్తుండడంతో ప్రస్తుత ధరల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లితే కిరాయిలు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేస్తున్నామని టమోటా రైతులు ఆవేదన చెందుతున్నారు. టమోటాను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తే బాగుంటుందని రైతులు సూచిస్తున్నారు. 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle