newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టమోటా ధరలకు రెక్కలు.. సామాన్యులకు చిక్కులు

30-06-202030-06-2020 13:04:17 IST
Updated On 30-06-2020 13:05:01 ISTUpdated On 30-06-20202020-06-30T07:34:17.983Z30-06-2020 2020-06-30T07:25:30.798Z - 2020-06-30T07:35:01.408Z - 30-06-2020

టమోటా ధరలకు రెక్కలు.. సామాన్యులకు చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టమోటా, ఉల్లి దోబూచులాడుతుంటాయి. ఒక దాని ధర తగ్గితే రెండవ దాని ధర ఆకాశాన్నంటుతుంది. రెండింటిలో ఏది లేకపోయినా వంటింట్లో కష్టమే. రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. నెల క్రితం కిలో రెండుమూడు రూపాయలు కూడా పలకడం కష్టంగా వుండేది. వారం క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.50కి చేరింది. కొత్త పంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుందని అప్పటివరకు ధర పెంపు తప్పదంటున్నారు వ్యాపారులు.

ఒకవైపు కరోనా దెబ్బకు ఆదాయవనరులు పడిపోయాయి. ఏం తినాలన్నా తడిసిమోపెడు అవుతోంది. తెలంగాణలో మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాలో మాత్రమే టమాటా సాగవుతోంది. ఈ జిల్లాల నుంచి హైదరాబాద్‌ మార్కెట్లకు రోజుకు 600–800 క్వింటాళ్ల మేర టమాటా వస్తుంది. గత వారం రోజులుగా దిగుమతులు తగ్గాయి. 

హైదరాబాద్‌ లో రోజువారి వినియోగం వినియోగం సగటున 5వేల క్వింటాళ్ల నుంచి 6వేల క్వింటాళ్లు ఉంటుంది. దీంతో డిమాండ్‌ను తీర్చేందుకు స్థానిక వ్యాపారులు ఎక్కువగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్‌లపై ఆధారపడి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. లాక్‌డౌన్‌ విధించిన అనంతరం హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గి ధరలూ తగ్గాయి. 

లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలలో వేసిన పంటకు డిమాండ్‌ లేక ధర పూర్తిగా పడిపోయింది. దీంతో ఏప్రిల్, మే నెలలో మన రాష్ట్రంతో పాటు, చిత్తూరు జిల్లాలోనూ పంట సాగు పూర్తిగా తగ్గింది. లాక్ డౌన్ వల్ల ఇళ్ళల్లో వినియోగం కూడా పెరిగింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడం, డిమాండ్ కు తగ్గ టమోటా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని చేరాయి. 

అందులోనూ రైతులు తాము వేసిన పంటను స్థానిక మార్కెట్లకే పంపిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ మంత్రం వాడుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే టమోటాలు తగ్గిపోతున్నాయి. ధర పెరుగుతోంది. టమోటాలకు తోడు కూరగాయల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌లోనే కిలో టమాటా ధర రూ.30–35 మధ్య ఉంది. ఆ ధరలకు కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయించే సరికి ఆ ధర రూ.40–45కి చేరుకుంటోంది. దీంతో రైతుబజార్లకు సాధారణ మార్కెట్లకు మధ్య కిలోకు 5 రూపాయల వరకూ తేడా కనిపిస్తోంది. కిలో కొనే వినియోగదారులు ఇప్పుడు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఉల్లిపాయల ధరలు తగ్గడంతో కొంతలో కొంత ఉపశమనం కలుగుతోందని చెప్పాలి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle