newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఇరుకున‌ప‌డ్డ కేసీఆర్‌

14-12-201914-12-2019 08:16:18 IST
2019-12-14T02:46:18.614Z14-12-2019 2019-12-14T02:46:14.590Z - - 24-01-2020

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఇరుకున‌ప‌డ్డ కేసీఆర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంద‌ని అంతా భావించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం, రెండు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఇక అంతా హ్యాపీగా సాగుతుంద‌ని భావించారు.

కానీ ఆరు నెల‌ల్లోనే సీన్ మారుతోంది. వివిధ అంశాల్లో రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య దూరం పెరుగుతోంది. తాజాగా, పోతిరెడ్డిపాడు కేపాసిటీని పెంచుతామ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌నతో మ‌రింత దూరం పెరిగే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. విభ‌జ‌న స‌మ‌స్య‌లు, నీటి పంప‌కాల విష‌యాల్లో తేడాలొచ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో రెండు రాష్ట్రాల పోలీసులు ప్రాజెక్టుల వ‌ద్ద బాహాబాహీకి కూడా దిగారు.

ఏపీ ప్రాజెక్టుల‌పై తెలంగాణ‌, తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల‌పై ఏపీ కోర్టుల మెట్ల‌కెక్కాయి. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఈ ప‌రిస్థితి మారుతుంద‌ని అంతా అనుకున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి సైతం జ‌గ‌న్ వెళ్లారు. గోదావ‌రి నుంచి వృధాగా స‌ముద్రంలో క‌లుస్తున్న నీటిని ఒక ఉమ్మ‌డి ప్రాజెక్టు నిర్మించి రెండు రాష్ట్రాలూ వాడుకోవాల‌ని ముఖ్య‌మంత్రులిద్ద‌రూ భావించారు.

ఇందుకోసం కొంత క‌స‌ర‌త్తు కూడా జ‌రిగింది. ఇద్ద‌రు సీఎంలూ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. కానీ, క్ర‌మంగా ఈ ప్రాజెక్టు అట‌కెక్కింది. తెలంగాణ‌తో సంబంధం లేకుండా ఏపీ భూభాగంలోనే ఈ ప్రాజెక్టును నిర్మించుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది.

ఇక‌, తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం తెలంగాణ‌కు న‌ష్టం చేసేలా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రాయ‌ల‌సీమ‌ను నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల‌కు పెంచుతామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

పోతిరెడ్డిపాడు ఎప్పుడూ వివాదాస్ప‌ద ప్రాజెక్టుగా ఉంటోంది. ఈ ప్రాజెక్టు వ‌ల్లే తెలంగాణ‌లోని ఉమ్మ‌డి పాల‌మూరు, న‌ల్గొండ జిల్లాలు న‌ష్ట‌పోతున్నాయ‌ని తెలంగాణ వాద‌న‌.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు పాల‌మూరును ఎండ‌బెట్టి పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టిండ‌ని కేసీఆర్ అనేకసార్లు ఆరోపించారు. ఒకానొక స‌మ‌యంలో ఈ విష‌యంపై వైఎస్‌ను దుర్మార్గుడు అంటూ కూడా కేసీఆర్ విమ‌ర్శించారు.

ఆ స‌మ‌యంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ మంత్రులు ద‌ద్ద‌మ్మ‌ల్లా ఉన్నార‌ని, హార‌తులు ప‌ట్టార‌ని సైతం కేసీఆర్ ఆరోపించారు.

ఇప్పుడు అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమారుడు, త‌న‌కు స‌న్నిహితంగా ఉంటున్న జ‌గ‌న్ పోతిరెడ్డిపాడు కెపాసిటీని రెండింత‌లు పెంచుతామ‌ని ఏకంగా అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. దీంతో తెలంగాణ‌లో విమ‌ర్శ‌లు మొద‌లయ్యాయి.

కాగా, ఈ విష‌యంపై తెలంగాణ ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వంపై కూడా విప‌క్షాలు ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టాయి. దీంతో కేసీఆర్ స‌ర్కార్ ఇరుకున‌ప‌డింది. తెలంగాణ ప్ర‌భుత్వం స్పంద‌న బ‌ట్టి రెండు రాష్ట్రాల సంబంధాలు ఆధార‌ప‌డి ఉండే అవ‌కాశం ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle