newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జైపాల్ రెడ్డి సోదరుడికే తప్పని కబ్జా తిప్పలు

13-03-202013-03-2020 09:41:10 IST
Updated On 13-03-2020 13:12:32 ISTUpdated On 13-03-20202020-03-13T04:11:10.928Z13-03-2020 2020-03-13T04:11:02.609Z - 2020-03-13T07:42:32.567Z - 13-03-2020

జైపాల్ రెడ్డి సోదరుడికే తప్పని కబ్జా తిప్పలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో విలువైన తమ భూముల ను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు పద్మారెడ్డి అతని కొడుకు జయప్రకాష్ రెడ్డి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కబ్జా రాయుళ్ళ కు సంబంధించిన కొందరు రెండురోజుల క్రితం అక్రమంగా తమ భూమిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శంషాబాద్ లో సంచలనం సృష్టించింది. 

దివంగత కాంగ్రెస్ నేత కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి స్వయాన సోదరుడైన ఎస్. పద్మారెడ్డి కుటుంబం గత 1997 లో శంషాబాద్ లోని సాతంరాయి లో కొంత భూమి ని కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 725/ 15 లో ఎకరన్నర భూమి ని కొనుగోలు చేశారు. అయితే హైదరాబాద్ కు చెందిన ఆరిఫ్, ఇమ్రాన్ అనే ఇద్దరి తో పాటు మరి కొందరు ఒక ముఠా గా ఏర్పడి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గత నెల 24 న  పద్మారెడ్డి తో పాటు అతని కొడుకు జయప్రకాష్ రెడ్డి ఆర్జీఐఏ  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు ఐపీసీ 447, 427 సెకన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ భూమిలోని గేటు తాళాలుధ్వంసం చేసి దౌర్జన్యం చేశారని... గోడల పై తమ సైన్ బోర్డు సూచికలను చెరిపేసి రంగులు వేశారని ఆరోపిస్తూ పద్మారెడ్డి అతని కొడుకు జయప్రకాష్ రెడ్డి మరోసారి ఏసీపి అశోక్ కుమార్ గౌడ్, సీఐ విజయ్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఘటనా స్థలంలో దొరికిన ముగ్గురు వ్యక్తుల ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

అంతే కాకుండా నిందితులు ఉపయోగించిన మారుతీ స్విఫ్ట్ కారును సైతం పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు తమకు సరైన న్యాయం చేయడం లేదని పద్మారెడ్డి మీడియా ముందు వాపోయారు. తమకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన వాపోయారు.

తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే శంషాబాద్ డీసీపి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని పద్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తమకు సరైన న్యాయం చేయాలని నిందితుల పై చర్యలు తీసుకోకపోతే సైబరాబాద్ కమీషనర్ సజ్జన్నార్ కు ఫిర్యాదు చేయనున్నట్లు పద్మారెడ్డి  చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వేళ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle