newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జేజే ఆస్పత్రికి వరవరరావు.. బెయిల్ కోసం పిటిషన్

14-07-202014-07-2020 09:27:43 IST
Updated On 14-07-2020 12:08:05 ISTUpdated On 14-07-20202020-07-14T03:57:43.164Z14-07-2020 2020-07-14T03:57:07.908Z - 2020-07-14T06:38:05.026Z - 14-07-2020

జేజే ఆస్పత్రికి వరవరరావు.. బెయిల్ కోసం పిటిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ హత్యకు కుట్రపన్నారనే అభియోగంతో బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కుటుంబసభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా.. లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జూమ్ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం వరవరరావుని ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లైవ్‌ వీడియో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వరవరరావు భార్య, కుమార్తెలు విజ్జప్తి చేసిన సంగతి తెలిసిందే. 

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తన భర్త వరవరరావుకి మంచి వైద్యం అందించాలని లేఖలు రాసినా కనీసం సమాధానం కూడా లేదని భార్య హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని, వరవరరావు ఆరోగ్యం విషయంలో సహాయం చేస్తానని ఆయన మాటిచ్చారని హేమలత చెప్పారు.

రెండురోజుల క్రితం ఆయనతో మాట్లాడితే మతిస్థిమితం లేనట్టు మాట్లాడుతున్నారని, ఎన్నో ఏళ్ళక్రితం జరిగిన తండ్రి అంత్యక్రియల గురించి వరవరరావు మాట్లాడుతున్నారని హేమలత చెప్పారు. ఈ మాటల తీరు చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అర్ధమవుతోందన్నారు. బెయిల్ కంటే ముందు తమ తండ్రి ఆరోగ్యం మెరుగవ్వాలని తాము కోరుకుంటున్నామని  ఆయన కుమార్తెలు సహజ, అనల, పవన అన్నారు. 

అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న వరవరరావుని తక్షణం విడుదల చేయాలని ఆయన మేనల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావును తక్షణమే విడుదల చేయాలని సామాజిక ఉద్యమకారులు, మేధావులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో #freevaravararao హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. వరవరరావు నడవలేని స్థితిలో, పళ్లు తోముకునే స్థితిలో కూడా లేరని జైలులో ఆయన సహచరులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారిలో ఆందోళన అధికమైంది. ఆయన ముఖకవళికల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఇదిలా ఉంటే,  తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది ఆర్‌.సత్యనారాయణ్‌ అయ్యర్‌ కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వరవరరావుకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్‌ 26న ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్ వేశారు. అలాగే వరవరరావు మెడికల్‌ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్‌ వేశారు. ఈసారైనా బెయిల్ వస్తుందా ? లేదా ? అన్నది టెన్షన్ పెడుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle