newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జెట్ స్పీడ్‌లో తెలంగాణ సచివాలయం తరలింపు

20-08-201920-08-2019 07:48:33 IST
Updated On 19-08-2019 19:07:22 ISTUpdated On 19-08-20192019-08-20T02:18:33.681Z19-08-2019 2019-08-19T12:46:41.584Z - 2019-08-19T13:37:22.066Z - 19-08-2019

జెట్ స్పీడ్‌లో తెలంగాణ సచివాలయం తరలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సచివాలయం తరలింపు వేగవంతంగా సాగుతోంది. సోమవారం ఎబిసి బ్లాకులను బూర్గుల రామకృ‌ష్ణారావు భవన్‌కు తరలించారు. ఫైళ్ల గల్లంతు, వాటిలోని కీలక డాక్యుమెంట్లు చిరగడం, మాయమవడం లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో సహా, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీఎస్‌లు ఇతర అధికారగణమంతా బీఆర్‌కే భవన్‌లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

Image may contain: 3 people, people standing and outdoorImage may contain: outdoor

ఇంకా ఏవైనా శాఖలు, విభాగాలు, సెక్షన్లు మిగిలితే వాటిని పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి తరలిస్తారు. ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలోని పబ్లిసిటీ సెల్‌ను, సీఎంఓలో భాగంగా ఉన్న సీపీఆర్ఓ కార్యాలయాన్ని కలిపి అక్కడే ఒక క్వార్టర్లో ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉంటే బీఆర్కేభవన్‌వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్, భద్రత తదితరాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బీఆర్‌కే భవన్‌లోనే వివిధ శాఖల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అధికారులు, ఉద్యోగులు ఎవరూ పాత సచివాలయంలో ఉండరాదని.. శుక్రవారం నుంచి నూతన ప్రాంగణంలో కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే.

Image may contain: one or more people and outdoorImage may contain: outdoor

దీంతో గత నెలరోజులుగా కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.  పాత సచివాలయం సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలోని బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012‌లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు. పాత సచివాలయాన్ని కూల్చి అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

పాత సచివాలయం భవనాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని ప్రభుత్వం చెబుతోంది.ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని అంటోంది. 

No photo description available.Image may contain: office and indoor

ఇలాంటి లోటుపాట్లు ఏవీ లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా సమీకృత సచివాలయ నిర్మిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా నిర్మిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. అయితే విపక్షాలు మాత్రం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, వాస్తు పేరుతో వందలకోట్లు దుబారా చేస్తున్నారని మండిపడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle