newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూలో బెంగాల్ టైగర్‌ కిరణ్ మృతి.. కన్నీటి వీడ్కోలు

26-06-202026-06-2020 10:34:47 IST
Updated On 26-06-2020 11:17:37 ISTUpdated On 26-06-20202020-06-26T05:04:47.051Z26-06-2020 2020-06-26T05:04:26.396Z - 2020-06-26T05:47:37.630Z - 26-06-2020

జూలో బెంగాల్ టైగర్‌ కిరణ్ మృతి.. కన్నీటి వీడ్కోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో అరుదైన జాతులు వున్నాయి. అయితే పులులు మాత్రం ఒకేరకమయిన వ్యాధితో మరణించడంతో వైద్యులు ఆదిశగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా బహదూర్‌పురా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్‌ కిరణ్‌ అనారోగ్యంతో మరణించింది. బెంగాల్‌ టైగర్‌ కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్‌ కణితితో బాధపడుతూ మరణించిందని అధికారులు తెలిపారు. బెంగాల్ టైగర్ కిరణ్ వయసు 8 ఏళ్లే. 

నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం జూపార్కు లో పుట్టి పెరిగిన కిరణ్‌ గతకొంతకాలంగా న్యూయో ప్లాస్టిక్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. కొన్నిరోజులుగా ల్యాంకోన్స్‌ శాస్త్రవేత్తలు, వైద్యులు, జూపార్కు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. గత నెల 29న టైగర్‌కు డాక్టర్‌ నవీన్, వీబీఆర్‌ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మృతి చెందిన టైగర్ కిరణ్ కు  వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు.

గతంలోనే కిరణ్‌ తండ్రి బద్రి కూడా ట్యూమర్ తో బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్‌ తాత రుద్ర పన్నెండేళ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. బద్రి, రుద్ర, కిరణ్ ఒకే రకమైన వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించారు. జూపార్కుకే వన్నె తెచ్చే రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ట్యూమర్‌ వ్యాధితో మరణించడంతో ఆందోళనకు గురి చేస్తోంది. పులులకు వచ్చే ట్యూమర్ల గురించి పరిశోధించి, భవిష్యత్తులో పులులు మరణించకుండా సరైన వైద్యం అందించాల్సిన అవసరం వుంది. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle