newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు

16-07-202016-07-2020 12:03:50 IST
Updated On 16-07-2020 13:38:17 ISTUpdated On 16-07-20202020-07-16T06:33:50.500Z16-07-2020 2020-07-16T06:33:48.477Z - 2020-07-16T08:08:17.265Z - 16-07-2020

జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక, మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. 

జూరాల ప్రాజెక్టుకు 9.657 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం నీటి నిలువ 9.542 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 62,500 క్యూసెక్కులు ఉండగా 8 గేట్ల ద్వారా 42,614 క్యూసెక్కుల నీటిని దిగువకు జూరాల అధికారులు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం 21,128 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి-750, బీమా-1 కు 650, కోయిల్ సాగర్ 630, కుడి ఎడమ కాలువ 985 సమాంతర కాలువ ద్వారా 800, బీమా ఎత్తిపోతల పథకం-2 ద్వారా 750 క్యూసెక్కుల నీటిని జూరాల అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం భారీగా ఉంటుందని జూరాల అధికారులు తెలిపారు.

మరోవైపు, శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు

జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1,100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నవెూదైంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle