newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రారంభం

18-05-201918-05-2019 15:00:41 IST
Updated On 27-06-2019 15:53:13 ISTUpdated On 27-06-20192019-05-18T09:30:41.063Z18-05-2019 2019-05-18T09:30:39.262Z - 2019-06-27T10:23:13.363Z - 27-06-2019

జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నగర వాసుల ప్రయాణాన్ని సుఖవంతం చేసింది హైదరాబాద్ మెట్రో రైలు. లక్షలాదిమంది మెట్రోను ఉపయోగిస్తున్నారు. తాజాగా అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మరో ఘట్టం ఆవిష్కతమయింది. ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్  కీలకమయింది. ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూసిన నగర వాసులకు కల ఫలించింది. ఈ స్టేషన్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 

ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్టినట్టయింది. నగరంలో కీలకంగా భావించే ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు అందనున్నాయి. సినిమా షూటింగ్‌లు, సాఫ్ట్ వేర్ ఆఫీసులకు వెళ్లే వారికి ఈ స్టేషన్ సౌకర్యవంతంగా ఉండనుంది. మెట్రో రైలులో  కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు. ఎండాకాలం కావడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాల్లో తిరిగే వారు సైతం మెట్రో ఎక్కేస్తున్నారు. 

మెట్రో ధరలు ఇలా ఉన్నాయి

 కనీస ధర రూ. 10 

 2-4కి.మీ -రూ. 15 

4-6కి.మీ - రూ. 25 

6-8కి.మీ - రూ. 30

8-10కి.మీ- రూ. 35

10-14కి.మీ-రూ. 40

 14-18కి.మీ-రూ. 45

 18-22కి.మీ -రూ. 50

 22-28కి.మీ- రూ. 55

26 కి.మీ దాటితే-రూ.60 

జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ ప్రత్యేకత ఏమిటంటే ఒకే అంతస్తులో టికెట్ కౌంటర్లు, ప్లాట్ ఫారం ఉండటం. కనుక ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలు, పెద్దవారికి ఇది చాలా సదుపాయంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోలో సగటున రోజుకు 2.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle