newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూప‌ల్లి తిరుగుబాటు ఎంత వ‌ర‌కు..?

17-02-202017-02-2020 07:17:35 IST
2020-02-17T01:47:35.383Z17-02-2020 2020-02-17T01:47:30.430Z - - 19-04-2021

జూప‌ల్లి తిరుగుబాటు ఎంత వ‌ర‌కు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రాజ‌కీయ ప‌య‌నం ఎటు వైపు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏడాది క్రితం వ‌ర‌కు మంత్రి హోదాలో చ‌క్రం తిప్పిన జూప‌ల్లిని గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మి రాజ‌కీయంగా ఇబ్బంది పెడుతోంది. పార్టీలో ఆయ‌న ప్రాభ‌వం వేగంగా త‌గ్గిపోతోంది. ఆయ‌నపై కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా గెలిచిన బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డం జూప‌ల్లి కృష్ణారావుకు మింగుడుప‌డ‌టం లేదు. దీంతో ఆయ‌న ఏకంగా పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్నారు.

సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్‌లో కొన‌సాగిన జూప‌ల్లి కృష్ణారావు కిర‌ణ్‌కుమార్ రెడ్డి హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌త్యేక తెలంగాణ కోసం ఆయ‌న మంత్రి ప‌ద‌విని సైతం వ‌దులుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆయ‌న‌కు టీఆర్ఎస్‌లో మంచి ప్రాధాన్యం ద‌క్కింది.

మొద‌టిసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జూప‌ల్లిని మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఐదేళ్ల పాటు మంత్రిగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జూప‌ల్లి చ‌క్రం తిప్పారు.

2018 ఎన్నిక‌ల్లో ఆయ‌న అనూహ్యంగా కాంగ్రెస్ అభ్య‌ర్థి బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు క‌ష్ట‌కాలం మొద‌లైంది. ఆయ‌న స్థానంలో జిల్లా నుంచి మంత్రిగా నిరంజ‌న్‌రెడ్డికి అవ‌కాశం వ‌చ్చింది. బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిని నిరంజ‌న్‌రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు.

అప్ప‌టి నుంచి నిరంజ‌న్ రెడ్డి, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో జూప‌ల్లికి ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. ఇటీవ‌లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించిన జూప‌ల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాలిటీకి త‌న వ‌ర్గం అభ్య‌ర్థుల‌ను ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌పున‌ నిల‌బెట్టారు.

వారిని పోటీ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని స్వ‌యంగా కేసీఆర్‌, కేటీఆర్ చెప్పినా జూప‌ల్లి విన‌లేదు. మెజారిటీ వార్డులు జూప‌ల్లి వ‌ర్గం గెలుచుకుంది. గెల‌వ‌గానే కేసీఆర్‌, కేటీఆర్‌ను క‌లిసేందుకు జూప‌ల్లి ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు.

తాము చెప్పినా విన‌కుండా పార్టీ అభ్య‌ర్థుల‌పైనే త‌న వ‌ర్గాన్ని గెలిపించుకున్న జూప‌ల్లిపై టీఆర్ఎస్ పెద్దలు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయ‌కపోయినా పూర్తిగా పార్టీకి దూరం పెట్టేశారు. దీంతో జూప‌ల్లి మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న మాత్రం తాను టీఆర్ఎస్‌లోనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

ఇంత‌లో వ‌చ్చినా పీఏసీఎస్ ఎన్నిక‌ల్లో కూడా జూప‌ల్లి మ‌రోసారి పార్టీపై తిరుగుబాటు చేశారు. కొల్లాపూర్‌లోని మొత్తం ఎనిమిది పీఏసీఎస్‌ల‌లో టీఆర్ఎస్ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా త‌న వ‌ర్గం నుంచి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టారు.

ఒక్క పీఏసీఎస్‌ను కూడా గెలిపించుకోలేక‌పోయినా చెప్పుకోద‌గ్గ స్థానాలు గెలిచి ప్ర‌భావం చూపించారు. ప‌దేప‌దే టీఆర్ఎస్‌పైన తిరుగుబాటు చేస్తున్నా అధిష్ఠానం వేచి చూసే ధోర‌ణిలో ఉంది. ఇటు జూప‌ల్లి కూడా వెనక‌డుగు వేయ‌డం లేదు. ఆయ‌న టీఆర్ఎస్‌లోనే ఉంటారా లేదా పార్టీ నుంచి వెళ్లిపోతారా అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొంత‌కాలం పాటు వేచి చూసి ఆయ‌న కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   26 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle