newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

27-01-202027-01-2020 07:50:14 IST
Updated On 27-01-2020 12:23:34 ISTUpdated On 27-01-20202020-01-27T02:20:14.534Z27-01-2020 2020-01-27T02:17:48.558Z - 2020-01-27T06:53:34.337Z - 27-01-2020

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఊహించిన‌ట్లుగా టీఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల రెబెల్స్ షాక్ ఇచ్చారు. ఇంచుమించు అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్‌కు చెందిన రెబెల్స్ పోటీ చేశారు. సుమారు 20 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం రాక‌పోవ‌డానికి కూడా రెబెల్స్ కార‌ణం. ఏకంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లోనూ రెబెల్స్ పెద్ద ఎత్తున విజ‌యం సాధించారు.

అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా రెబెల్స్ సాధించిన విజ‌యం ఒక ఎత్తు అయితే నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వ‌ర్గం సాధించింది మ‌రో ఎత్తు. ఆయ‌న పార్టీ ఆదేశాల‌ను, బుజ్జ‌గింపుల‌ను, హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేసి మ‌రీ కొల్లాపూర్‌లో త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించి షాక్ ఇచ్చారు. ఇక్క‌డ 20 వార్డులు ఉండ‌గా టీఆర్ఎస్ పార్టీ 9 గెలుచుకోగా జూప‌ల్లి వ‌ర్గీయులు ఏకంగా 11 వార్డులు గెలుచుకొని స‌త్తా చాటారు.

2014 నుంచి 2018 వ‌ర‌కు జూప‌ల్లి ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఆయ‌న జిల్లాలో కీల‌క పాత్ర పోషించారు. కానీ, 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి చేతిలో ఓడిపోయాక జూప‌ల్లికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. గెలిచాక బీరం టీఆర్ఎస్ పార్టీలో చేర‌డంతో కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు నెల‌కొంది. మున్సిపల్ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు ఎమ్మెల్యేల‌పై పెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం కొల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన బీఫాంలు ఎమ్మెల్యే చేతికి ఇచ్చింది.

దీంతో జూప‌ల్లి కృష్ణారావు వ‌ర్గంలో అసంతృప్తి నెలకొంది. మొత్తం 20 వార్డుల్లో ఆయ‌న ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ(సింహం గుర్తు) త‌ర‌పున జూప‌ల్లి త‌న అనుచ‌రుల‌ను పోటీలో నిలిపారు. ఈ విష‌యంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఎంత న‌చ్చ‌జెప్పినా, హెచ్చ‌రిక‌లు జారీ చేసినా జూప‌ల్లి వెన‌క్కు త‌గ్గ‌లేదు. 20 మంది అభ్య‌ర్థులు కూడా జూప‌ల్లి ఫోటోతోనే ప్ర‌చారం చేసుకున్నారు. జూప‌ల్లి బ‌హిరంగంగా ప్ర‌చారం చేయ‌కున్నా త‌న అనుచ‌రుల గెలుపు కోసం అంత‌ర్గ‌తంగా తీవ్రంగా కృషి చేశారు.

ఇప్పుడు మున్సిపాలిటీలో 11 సీట్లు సాధించిన జూప‌ల్లి వ‌ర్గీయులకు మున్సిప‌ల్ పీఠం ద‌క్కాలి. మ‌ళ్లీ వీరు టీఆర్ఎస్‌లోకి వెళ‌తార‌ని, జూప‌ల్లిని టీఆర్ఎస్ పెద్ద‌లు మ‌ళ్లీ పిలిచి మాట్లాడ‌తార‌ని అంతా భావించారు. కానీ, పార్టీకే స‌వాల్ విసిరి పార్టీ అభ్య‌ర్థుల‌పై త‌న అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్న జూప‌ల్లిపై టీఆర్ఎస్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యాన్ని ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టం చేసిన టీఆర్ఎస్ జూప‌ల్లి వ‌ర్గీయుల‌కు సంబంధం లేకుండానే ఎక్స్ అఫీషియో స‌భ్యుల‌తో కొల్లాపూర్ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసింది.

టీఆర్ఎస్ పెద్ద‌ల‌ను క‌లిసేందుకు జూప‌ల్లి ప్ర‌య‌త్నించినా మొహం చాటేసిన‌ట్లు స‌మాచారం. దీంతో బ‌లం చాటుకున్న జూప‌ల్లి పార్టీ పెద్ద‌ల ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌చ్చింది. దీంతో ఆయన‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఒక‌వైపు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఆయ‌నే పార్టీకి రాజీనామా చేస్తార‌ని మ‌రోవైపు ప్ర‌చారం సాగుతోంది.

తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీని, మంత్రి ప‌ద‌విని వ‌దిలి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన జూప‌ల్లికి అవ‌మానం ఎదురైంద‌ని, ఆయ‌న ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్‌ను వీడాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌ెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు.

అంటే, ఆయ‌న‌ను మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా కోరిన‌ట్లు లెక్క‌. గ‌తంలో జూప‌ల్లికి కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండే డీకే అరుణతో విభేదాలు ఉండేవి. ఆయ‌న పార్టీ వీడేందుకు ఈ విభేదాలు కూడా ఒక కార‌ణ‌మే. ఇప్పుడు ఆమె బీజేపీలో ఉండ‌టంతో కాంగ్రెస్‌లో ఎవ‌రితోనూ ఆయ‌న‌కు బేదాభిప్రాయాలు లేవు. మ‌రి, ఆయ‌న టీఆర్ఎస్‌లోనే ఉంటారా, కాంగ్రెస్‌లోకి వెళ‌తారా అనేది వేచి చూడాల్సి ఉంది. టీఆర్ఎస్ ఆధిష్ఠానం మాత్రం జూప‌ల్లిపై జాలి చూపే పరిస్థితిలో లేదు.

కాగా, జూప‌ల్లిపై కోపంగా ఉన్న టీఆర్ఎస్ మిగ‌తా చాలా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ రెబెల్స్‌ను అప్పుడే త‌మ పార్టీలో చేర్చేసుకుంటోంది. టీఆర్ఎస్ రెబెల్స్ మ‌ద్ద‌తు లేక‌పోతే క‌నీసం 10 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఛైర్మ‌న్‌గిరి ద‌క్కించుకునే అవ‌కాశం లేదు.

కాబ‌ట్టి, ఫ‌లితాలు వ‌చ్చిన మ‌రు నిమిషం నుంచే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన టీఆర్ఎస్ రెబెల్ అభ్య‌ర్థుల‌తో మాట్లాడి పార్టీలో చేర్చుకుంటున్నారు. మ‌రి, మిగ‌తా చోట్ల రెబెల్స్ ప‌ట్ల సానుకూలంగా ఉన్న టీఆర్ఎస్ జూప‌ల్లి విష‌యంలో మాత్రం సీరియ‌స్‌గా ఉండ‌టానికి కార‌ణ‌మేంటో తెలియ‌దు.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle