జీవన్ రెడ్డి ఇచ్చిన జోష్.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్
13-08-202013-08-2020 08:03:14 IST
Updated On 13-08-2020 10:17:48 ISTUpdated On 13-08-20202020-08-13T02:33:14.245Z13-08-2020 2020-08-13T02:33:09.714Z - 2020-08-13T04:47:48.248Z - 13-08-2020

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత బలపడినా సరే ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం బలహీనపడిందని చెప్పలేం. రాష్ట్రంలో గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఆ పార్టీకి బలం. అందుకే వరుస ఓటములు ఎదురైనా ఆ పార్టీలో టిక్కెట్ల కోసం డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. టిక్కెట్ రేసులో ఉన్న నేతలు ఇప్పటికే జిల్లాల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చ్‌లో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని చాలా మంది నేతలు సిద్ధమవుతున్నారు. గత ఏడాది కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఇందుకు ప్రధాన కారణం. పట్టభద్రుల స్థానంలో విద్యావంతులే ఓటర్లుగా ఉంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రావడం లేదని, నోటిఫికేషన్లు లేవనే అసంతృప్తి నిరుద్యోగ పట్టభద్రుల్లో ఉంది. పైగా రాజకీయాలను నిశితంగా గమనించగలిగే సామర్థ్యం వీరికి ఉంటుంది. అందుకే శాసనమండలిలో ప్రతిపక్షమే లేకుండా పోతున్న పరిస్థితుల్లో కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మండలికి పంపించారు. ఈ జోష్‌తో వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాన్ని కూడా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పైగా పట్టభద్రుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి ఉందని జీవన్ రెడ్డి ఎన్నికతో రుజువైందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో టిక్కెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా డా.ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎర్రంరెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక నేతగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఈయన పలు విద్యా సంస్థలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టిక్కెట్ రేసులో ఉన్న తిరుపతిరెడ్డి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ కూడా ఈ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఓయూలో చాలాకాలంగా ఆయన పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇస్తుందా ? ఇవ్వదా ? అనేది తేలాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. నిజానికి ఆయన నివసించేది హైదరాబాద్ కాబట్టి అది ఆయన స్వంత నియోజకవర్గంగా భావించవచ్చు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి, బీజేపీ సిట్టింగ్ స్థానమైన తన స్వంత జిల్లాలో పోటీ చేయకుండా నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి కోదండరాం వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ అభ్యర్థే పోటీ చేస్తాడని భావిస్తున్నారు. మరి, కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
an hour ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
11 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
11 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా