newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

13-11-201913-11-2019 15:13:09 IST
2019-11-13T09:43:09.320Z13-11-2019 2019-11-13T09:43:04.576Z - - 24-02-2020

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలుస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  చెప్పారు. కేసీఆర్ తీసుకొస్తున్న లక్షల కోట్ల విలువైన జీవోలను తెలంగాణ ప్రభుత్వం దాచిపెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ప్రశంసలు గుప్పించటంపై స్పందిస్తూ .. ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాల్లో భాగంగా కేంద్ర మంత్రులు సీఎంను కలవటం సహజమేనని  లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. 

ఒకవైపు రెండో దఫా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బలం తరిగిపోతోందని అదేసమయంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు వివరించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోవన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలంమేంటో నిరూపించుకుంటామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. 

బుధవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగాయన్నారు. గతంలో కేసీఆర్‌ను సమర్థించిన కార్మికులు, ఉద్యోగులు.. నేడు ఆయనకు దూరమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా తమ పార్టీకి రెఫరెండమే అని ప్రకటించారు. కేసీఆర్‌కు ధైర్యముంటే కాల పరిమితి ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపైనా లక్ష్మణ్ స్పందించారు. కొత్త అధ్యక్షుడు ఎవరనేది డిసెంబర్‌లో తేలనుందన్నారు. కొత్త అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle