newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జీతాల్లో కోత.. కానీ పేదల సాయం మాత్రం కట్!

29-05-202029-05-2020 06:37:25 IST
Updated On 29-05-2020 09:31:03 ISTUpdated On 29-05-20202020-05-29T01:07:25.714Z29-05-2020 2020-05-29T01:07:23.092Z - 2020-05-29T04:01:03.617Z - 29-05-2020

జీతాల్లో కోత.. కానీ పేదల సాయం మాత్రం కట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం దేశవ్యాప్తం లాక్ డౌన్ సడలింపులులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులతో కార్యకలాపాలను నిర్వహించుకోవడంతో పాటు వారి పూర్తి జీతాలను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడతల వారీగా సడలింపులతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. కొన్ని పరిశ్రమలు మినహా ఇప్పటికే అందరూ తమతమ ఉద్యోగులను, సంస్థలను కాలాడుకొనే పనిలో పడ్డారు.

ముఖ్యంగా షాపింగ్ మాల్స్, సినిమా సంస్థలు, ఇతర లగ్జరీ పరిశ్రమలకు సంబంధించిన కొన్ని సంస్థలు తప్ప దాదాపుగా అన్ని పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. అంటే దాదాపుగా లాక్ డౌన్ కు ముందు పనిచేసే వీరిలో తొంబై శాతం మందికి మళ్ళీ పని దొరుకుందన్నది ప్రభుత్వాల అభిప్రాయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం గత రెండు నెలలుగా కార్మికులకు ఇచ్చే కరోనా అత్యవసర సహాయం 1500 నగదు పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్టంలో ఆర్ధిక పరిస్థితిపై చర్చించారు. ముఖ్యంగా లాక్ డౌన్ తో రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈక్రమంలోనే గత రెండు నెలలుగా చేస్తున్న కరోనా ఆర్ధిక సాయాన్ని జూన్ నెలలో నిలిపివేయాలని భావిస్తున్నారు.

అదే విధంగా గత రెండు నెలలుగా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో కోత మాత్రం జూన్ నెలకు కూడా కొనసాగించాలని సీఎం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు కరోనా సాయాన్ని జూన్ నెల నుండి నిలిపివేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో కోతలను మాత్రం కొనసాగించాలని సీఎం తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉన్నట్లుగా తెలుస్తుంది.

నిజానికి లాక్ డౌన్ కి ముందు రాష్ట్రానికి ప్రతీ నెలా రూ 12,000 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని ఇప్పటికే ఆర్ధిక వేత్తలు తేల్చారు. లాక్‌డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా ఇప్పటికీ ఇంకా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదని గుర్తించారు.

దానితో జూన్ నెలలో కూడా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాలలో కోతలను కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలు ఉంటాయని తీర్మానించారు.

కాగా, వచ్చే జూన్ నెలలో ప్రభుత్వం ఆదాయం పెంచుకొనే మార్గాలపై కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ప్రయాణంపై మరికొన్ని సడలింపులు ఇచ్చేందుకు సిద్దమైన ప్రభుత్వం రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విభాగాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే, ప్రభుత్వానికి ఆదాయం పెరిగి యధాస్థితికి వచ్చేవరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపుకు నామం పెట్టడం ఎంతవరకు న్యాయం అన్నది ప్రభుత్వాలు మరొకసారి ఆలోచించుకోవాల్సి అంశం!

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle