జీఎస్టీ బిల్లుకు మొదటే మద్దతిస్తే ఇంత అన్యాయమా... కెసిఆర్ సీరియస్
02-09-202002-09-2020 06:50:52 IST
Updated On 02-09-2020 07:12:44 ISTUpdated On 02-09-20202020-09-02T01:20:52.526Z02-09-2020 2020-09-02T01:20:50.745Z - 2020-09-02T01:42:44.383Z - 02-09-2020

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును సమర్థించి, మొట్టమొదటిగా స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినదానికి ప్రతిఫలంగా ఇప్పుడు కరోనా కష్టకాలంలో జీఎస్టీ బకాయిలు చెల్లించబోమంటూ తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తారా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ కేంద్రాన్ని నిలదీశారు. జీఎస్టీ ఫలాలు దీర్ఘకాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహదపడుతుందని అనుకున్నాం కానీ న్యాయంగా తెలంగాణకు రావలసిన వాటాను కూడా జీఎస్టీ నుంచి చెల్లించకుండా కేంద్రం అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్దమంటూ కేసీఆర్ వాపోయారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు కలుగుతున్న నష్ట పరిహారానికి గాను కేంద్రం అప్పు చేసి తీర్చవలసింది పోయి రాష్ట్రాలనే అప్పు చేసుకోవచ్చని చెప్పడం ఏమిటని కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రా ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందినట్లే అని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలోరుణాలపై ఆంక్షలు సహేతుకం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎస్టీని రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయి. సరిగ్గా ఇదే కారణంపై రాష్ర్టాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కచ్చితంగా నిబంధన ఉన్నా.. జీఎస్టీ పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. కోవిడ్-19 కారణంగా 2020, ఏప్రిల్‌లో నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను నష్టపోయింది. అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, పేమెంట్ల భారం పెరిగిపోయింది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ పరిణామాల నుంచి గట్టెక్కాల్సి వచ్చింది అని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌లకు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
5 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
11 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా