newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జీఎస్టీ పరిహారం తెగదు.. కోర్టులోనే తేల్చుకుంటాం.. హరీష్ రావు

16-09-202016-09-2020 07:04:10 IST
2020-09-16T01:34:10.545Z16-09-2020 2020-09-16T01:34:08.050Z - - 19-04-2021

జీఎస్టీ పరిహారం తెగదు.. కోర్టులోనే తేల్చుకుంటాం.. హరీష్ రావు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్థిక అవసరాలను కేంద్రం తోసిపుచ్చుతున్న నేపథ్యంలో జీఎస్టీ పరిహరం పొందే విషయంలో రాష్ట్రానికి న్యాయపోరాటం తప్ప మరో మార్గం కనిపించట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి సుమారు రూ.8,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇందులో సుమారు రూ.2,812 కోట్ల నిధులు గత మూడేళ్ల ఐజీఎస్టీ పరిహారం కాగా, రూ.6,016 కోట్ల మేర జీఎస్టీ పరిహారం రావాల్సి ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి హక్కుగా, గ్రాంట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇవే కాకుండా జీఎస్టీ కింద రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, ఇంకా మరిన్ని నిధులు రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా గత 5 నెలల్లో రూ.55,638 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులు తెస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఆర్టికల్‌ 293 ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితిని కేంద్రమే నిర్ణయిస్తుందని.. ఆ విమర్శలు చేసే వాళ్లు గుర్తుంచుకోవాలి’’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్రాల అప్పులకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జాబితాలో తెలంగాణ చివరి నుంచి రెండో రెండో స్థానంలో ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిలిపేశారని, తెలంగాణలో అలా చేయలేదన్నారు. క్లిష్టసమయంలో కూడా రూ.7,254 కోట్లు రైతుల కోసం విడుదల చేశామన్నారు. రైతు రుణమాఫీ, బీమా, విద్యుత్‌ రాయితీ, ఆసరా పెన్షన్‌.. ఇలా ఎన్నో పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. దాదాపు అయిదు నెలల కాలంలో రూ.55,638 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

కాగా రాష్ట్రానికి రావాల్సిన పరిహారం విషయంలో కేంద్రం కొంత స్పష్టత ఇచ్చింది. 2019-20వ ఆర్థిక సంవత్సరంలో రూ.3,054 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఇచ్చామని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జూలై కాలానికి సుమారు రూ.5,424 కోట్ల పరిహారాన్ని ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌కు సమాచారమిచ్చింది. అంటే.. రాష్ట్రానికి రూ.5,424 కోట్ల జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సి ఉన్నట్టు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువ నష్టం ఏప్రిల్‌, మే నెలల్లో జరిగింది. జూన్‌ నుంచి ఆదాయం కొంతమేరకు పెరిగింది. ఆగస్టులో దాదాపు అంచనా వేసిన దానిలో కొంత అటు ఇటూగా వచ్చినట్టు సమాచారం. సెప్టెంబరు నుంచి వసూళ్లు అంచనాల మేరకే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు ప్రతిపాదనలనూ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. 

తెలంగాణ ఆర్థిక అవసరాలను కేంద్రం తోసిపుచ్చుతున్న నేపథ్యంలో జీఎస్టీ పరిహరం పొందే విషయంలో రాష్ట్రానికి న్యాయపోరాటం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. రాష్ట్రాలకు జీఎస్టీ నష్టాన్ని నేరుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని స్పష్టమైంది. కేంద్రం ప్రతిపాదించిన రెండు మార్గాలనూ తెలంగాణ తిరస్కరించిన నేపథ్యంలో మిగిలిన మార్గం న్యాయపోరాటమేనని విశ్లేషకులు అంటున్నారు. 

కేంద్రం సూచించిన ఏ ప్రతిపాదనకు ఒప్పుకొన్నా.. పైన పేర్కొన్న రూ.5,424 కోట్లను రుణం ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో జీఎస్టీ వసూళ్లు బాగానే ఉండే అవకాశం ఉన్నందున, ఇంత కంటే ఎక్కువ రుణం వచ్చే వీలు కూడా లేదు. రూ.5,424 కోట్ల కోసం కేంద్రం ప్రతిపాదనలకు అంగీకరించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కావాలంటే.. ఈ రూ.5 వేల కోట్లను నేరుగానే రాష్ట్రం రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. ఎలాగూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతో రుణ పరిమితి పెరగనుంది. 

ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించినట్టు సమాచారం. ఆ నిధులను రాబట్టుకోవడానికి న్యాయపోరాటానికి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన మిగతా రాష్ట్రాలూ న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉంది.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   17 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle